ఆంధ్రప్రదేశ్‌

ఒకేరోజు ఎంపీటీసీ స్థానాలకు 3700 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 11: రాష్ట్రంలో వివిధ ఎంపీటీసీ స్థానాలకు ఒకే రోజు 3700 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో 9947 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 4535 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 3700 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. 652 జడ్పీటీసీ స్థానాలకు 422 నామినేషన్లు దాఖలు కాగా, మంగళవారం 354 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
పోస్టల్ బ్యాలెట్‌కు 14 వరకూ దరఖాస్తు గడువు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఎన్నికల సిబ్బంది ఈ నెల 14లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల లోగా సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయాలి. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 16న శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విధి నిర్వహణ ఏ మండలంలో నిర్వహించాలన్న ఉత్తర్వు కూడా శిక్షణ సమయంలో ఇస్తారు.