ఆంధ్రప్రదేశ్‌

డీజీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబు బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 11: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. దాడిలో గాయపడిన నేతలతో పాటు దెబ్బతిన్న వాహనాలతో ర్యాలీగా డీజీపీ కార్యాలయం వరకు చేరుకున్నారు. కార్యాలయం ఎదుట చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు ర్యాలీకి సీపీఐ రాష్టక్రార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. కార్యాలయం వద్ద బైఠాయించిన చంద్రబాబుతో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. మాచర్లలో తమ పార్టీ నేతలపై జరిగిన దాడి ఘటనను డీజీ రవిశంకర్‌కు చంద్రబాబు వివరించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు టీడీపీ నేతలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎలక్షన్ కమిషన్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
*చిత్రం...డీజీపీ కార్యాలయం వద్ద బైఠాయించిన చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న