ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 11: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు నలుగురు వైసీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నలుగురికి బీ ఫారాలు అందజేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శాసనమండలి ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నలుగురి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు వరుసగా తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. పరిమళ్ నత్వానీ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల స్వీకరణ అనంతరం అసెంబ్లీ కార్యదర్శి వారికి స్వీకరణ రశీదులు అందజేశారు. ఈ నెల 16,18 తేదీల్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. అదే రోజున అభ్యర్థి లేదా ఆయన తరుపున ప్రతిపాదకులు హాజరు కావాలని కోరారు. అభ్యర్థుల వెంట రాష్ట్ర రాజకీయ, ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియా పాయింట్‌లో అభ్యర్థులు మాట్లాడారు.
వైసీపీలో బీసీలకు పెద్దపీట: పిల్లి
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే బలహీన వర్గాలకు ఆదరణ ఉందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావించి నిధులు సమీకరించేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అవకాశ వాద రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
సీం జగన్ సాహసోపేతమైన నిర్ణయం: మోపిదేవి
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడి బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు.
పరిశ్రమలు, ఉపాధి కల్పనకు కృషి: అయోధ్యరామిరెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ ఉన్న నేత అని వైసీపీ సీనియర్ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తనను పెద్దల సభకు ఎంపిక చేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. తనకు పరిశ్రమలపై ఉన్న అనుభవానికి రాజకీయ అనుభవం జోడించి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తానని ప్రకటించారు. స్వచ్ఛ్భారత్, మేకిన్ ఇండియా వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్భ్రావృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రలు, ఉపాధి అవకాశాల కల్పనకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. గత అనుభవంతో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామన్నారు. భవిష్యత్ రాజకీయాలకు ముఖ్యమంత్రి జగన్ మార్గదర్శకులయ్యారని కొనియాడారు.
రాష్ట్ర వాదనలు వినిపిస్తాం : పరిమళ్ నత్వానీ
రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు పరిమళ్ నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన అవకాశంతో రాజ్యసభలో రాష్ట్రం తరుపున వాదనలు వినిపించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణకు సహకరించానని ఏపీలో కూడా పారిశ్రామికీకరణ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో దేశానికే వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. రాజకీయ చరిత్రలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం హర్షణీయమని అన్నారు.

*చిత్రాలు.. రాజ్యసభ వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పిస్తున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి