ఆంధ్రప్రదేశ్‌

అక్రమ మద్యం రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 11: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీసు, డైరెక్టరేట్ ఆప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పర్యవేక్షణలో ఆపరేషన్ సురా (కో-ఆర్డినేటింగ్ క్లస్టర్ రైడ్స్) కింద రాష్టవ్య్రాప్తంగా పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం 5 గంటల నుండి సుమారు 10 వేల మంది సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వందలాది మంది పోలీసు, ఎక్సైజ్ అధికారులతో కూడిన బృందాలు, ఎఎస్‌పి, డిఎస్‌పి, ప్రొబేషనరీ ఐపిఎస్, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. రాష్టవ్య్రాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాలు, నిల్వలు, విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 345 బృందాలతో రాష్ట్రంలోని 827 గ్రామాల్లో దాడులు జరిపి 318 మంది కేసులు నమోదు చేసి 275 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 1,01,045 లీటర్ల బెల్లం ఊట నిల్వలను ధ్వంసం చేయడంతో పాటు 2114.5 లీటర్ల సారా, 666 కేజీల బెల్లం, 252.454 లీటర్ల చీప్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తిరగుతున్న 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాడేరులో 1575 కిలోల గంజాయి, మూడు వాహనాలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. రాష్టవ్య్రాప్తంగా పోలీసులు జరిపిన దాడుల్లో 414 బృందాలు పాల్గొన్నాయి. 365 కేసులు నమోదు చేసి 427 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 2036.549 లీటర్ల మద్యం, 2512.65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రెండు శాఖలకు సంబంధించిన దాడుల్లో 759 బృందాలు పాల్గొని 683 కేసులు నమోదు చేసి 702 మందిని అరెస్ట్ చేశారు.