ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 14: రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యథేచ్ఛగా కొనసాగుతోందని, పోలీసులే టెర్రరిజానికి పాల్పడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను ఎన్ని విధాలుగా అడ్డుకోవాలో అన్ని విధాలుగానూ అడ్డుకుంటున్నారన్నారు. అందుకోసం ఒక నల్లచట్టం తీసుకువచ్చి వారికి కావాల్సిన ఆంక్షలను అందులో పొందుపర్చి చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శనివారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజా ప్రతినిధులుగా పోటీచేసే వారిపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చట్టపరంగా, రాజ్యాంగపరంగా పనిచేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారన్నారు. ఎవరైనా చట్టప్రకారం పనిచేయాలన్నా వీలుకాని టెర్రరిజం సృష్టించారన్నారు. ప్రతిపక్షాల ఆర్థికమూలాలను దెబ్బతీసేలా ప్రయత్నించడంతో పాటు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నామినేషన్లు వేసే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు మారు వేషాల్లో వెళ్లి నామినేషన్లు వేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. నామినేషన్ల పరిశీలనలోనూ అరాచకాలు మొదలయ్యాయని, అడ్డగోలుగా, ఏకపక్షంగా చేశారని, మళ్లీ ఇప్పుడు ఉపసంహరణల్లో అదే హింస, వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కొందరు వీరి బాధలు తట్టుకోలేక లొంగిపోయే పరిస్థితులకు వచ్చారన్నారు. మహిళలపై దాడులు చేయడం, బైండోవర్ కేసులు పెట్టడం, మద్యం ఉందంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. డీజీపీ కోర్టుకు వెళ్లి ఒక సెక్షన్ చదివి వినిపించడం చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న వైసీపీ నేతలు అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. పోలీసుల బెదిరింపులపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను ప్రజలే ప్రతిఘటించే రోజు రానుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అందరికీ రక్షణ కరవైందని, అవకాశవాదులు చరిత్ర హీనులుగా మారనున్నారన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో ఇలా అన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా గుండెపోటుగా చిత్రీకరించి కేసును మాఫీ చేసేందుకు యత్నించారని, గాయాలు చూసిన వివేక కూతురు ఇదే హత్యేనని, సహజ మరణం కాదని చెప్పారన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైన కారణంగానే హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. తాను విశాఖ పర్యటనకు అన్ని అనుమతులు తీసుకుని వెళితే మాజీ ముఖ్యమంత్రినని కూడా చూడకుండా 151 సెక్షన్ కింద తనను అరెస్ట్ చేశారని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఏ చట్ట ప్రకారం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారో లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరినా పోలీసులు తెలపలేదన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిషోర్‌లపై ఎమ్మెల్యే అనుచరుడే హత్యాప్రయత్నం చేశాడని ఆరోపించారు. తెనాలిలో తమ పార్టీ నాయకుడి ఇంట్లో పెట్టిన మద్యం సీసాలు వైసీపీ వారి నుండి వచ్చే వచ్చినట్లు తెలిసిందన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఉగ్రవాదులు కంటే దారుణంగా మారారని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మరింత పేట్రేగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.
*చిత్రం... టీడీపీ అధినేత చంద్రబాబు