ఆంధ్రప్రదేశ్‌

‘స్థానిక’ ఎన్నికలన్నీ 6 వా రా లు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: కరోనా వైరస్ వ్యాపిస్తోందనే కారణంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 21న జరగాల్సి ఉండగా 19న సాయంత్రానికి ప్రచారం ముగియాల్సి ఉంది. అలాగే నగర, పురపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసి నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ జరిగి సోమవారం సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెలువడాల్సి ఉంది. 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ ఆదివారం ఉదయం జారీ చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి సహా ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదివారం ఉదయం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ వర్గాల్లో ఇది ఒక్కసారిగా కలకలం రేపింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఆరు వారాల తర్వాత ప్రకటిస్తామని, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఉంటాయని ఆయన ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు నిలిపివేస్తున్నామంటూనే ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎన్నికల కోడ్ యథాతథంగా అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడటం, గంటల తరబడి ఓటర్లు క్యూలైన్లలో నిలబడాల్సి రావటం వల్ల ఒకరిని ఒకరు తాకే అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ముప్పు పొంచి ఉందన్నారు. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా ప్రజల ఆరోగ్య భద్రతను పణంగా పెట్టకూడదనే వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవిస్తోందని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారన్నారు. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించాక వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాల్టీలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అవసరమైన మేరకు సవరిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలకు ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు యదార్థంగా నిలిపివేత మాత్రమేనని, రద్దుకాదని పేర్కొన్నారు. నామినేషన్ వేసినవారిని భయభ్రాంతులకు గురిచేయకూడదని, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం కమిషన్ బాధ్యత అని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ వలంటీర్లపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అత్యంత హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో చిత్తూరు, గుంటూరు జిల్లాల
కలెక్టర్లు, గుంటూరు ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీ బదిలీకి ఆదేశించినట్లు ప్రకటించారు. మాచర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విధులను సమర్థవంతంగా నిర్వహించనందున సస్పెన్షన్‌కు ఆదేశించారు. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐల బదిలీలకు సైతం ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. ఎన్నికలు వాయిదాపడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే వ్యక్తిగత పథకాలకు నిషేధం వర్తిస్తుందని, ప్రభుత్వ దైనందిన కార్యకమాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రామ వలంటీర్లు తీరుపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు.
సీఎం జగన్ ఆగ్రహంపై స్పందన
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి, విలేఖరుల ఎదుట నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తక్షణం స్పందించారు. కరోనాపై జాతీయ స్థాయిలో హెచ్చరికలు, సంప్రదింపులు జరిగిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేశామని తెలిపారు. కరోనా ప్రభావం తగ్గితే ఆరువారాలు, లేదా అంతకన్నాముందే ఎన్నికలు జరుపుతామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ అని, హైకోర్టు న్యాయమూర్తికి ఉండే విశేష అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఏ పార్టీకీ లబ్ధి చేకూర్చని విధంగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. ఇక ఇళ్లపట్టాల పంపిణీ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుందని రమేష్‌కుమార్ స్పష్టం చేశారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్