ఆంధ్రప్రదేశ్‌

కల్యాణోత్సవం రద్దు ఏకపక్ష నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, మార్చి 14: కరోనా బూచితో అనాదిగా కొనసాగుతున్న ఆచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిలోదకాలు ఇవ్వడం శ్రీరాముడి భక్తులను కలచివేస్తోంది. మర్యాద పురోషోత్తముడు సీతారాముడు నడిచిన నేల కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి ఏటా పౌర్ణమి నాటి రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో గత కొనే్నళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత పాలకమండలి నిర్ణయం మేరకు పూజాకార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఏకంగారద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకోవడం భక్తులకు అశనిపాతంగా మారింది. ఏకశిలానగరంగా పేరుగాంచిన ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిండుపున్నమి నాటి రాత్రి సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో బహిరంగ ప్రదేశంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ ప్రకటించడం భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు గొడ్డలిపెట్టుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రశ్నలు భక్తులనుంచి తలెత్తుతున్నాయి. రద్దు నిర్ణయానికి ముందు వేద పండితులు, ఆగమశాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్నారా అని భక్తులు నిలదీస్తున్నారు. కరోనా పేరుతో ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణోత్సవం రద్దు బహిరంగ ప్రదేశంలో జరుగుతోందని సాకు చెప్పడమేనా లేక గుడి లోపల కూడా జరుపకుండా రద్దు చేస్తారా అన్న అనుమానం భక్తుల్లో తలెత్తుతోంది. దీనిపై టీటీడీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటికే ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చాలావరకు జరుగుతున్నాయి. కల్యాణ వేదిక ఏర్పాట్లను టీటీడీ ఉన్నతాధికారులు పరిశీలించారు. స్వామివారి కల్యాణానికి అవసరమైన బియ్యం తలంబ్రాలు భక్తులు చేతులతో ఒలిచి తెచ్చే పనులు కూడా మొదలయ్యాయి. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఎపుడెపుడు జరుగుతుందా? కనులారా వీక్షించి జన్మ ధన్యం చేసుకుందామా అని లక్షలాది భక్తులు ఎదురుచూస్తుంటారు. కరోనా వ్యాధి పేరుతో ఆనవాయితీగా వస్తున్న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం రద్దు నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మరోమారు పునరాలోచించాల్సిన అవసరం ఎంతైన ఉంది. కల్యాణం రద్దుపై టీటీడీ నిర్ణయం వెలువడగానే భక్తులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో కరోనా లేదని, ఒకవేళ వచ్చినా నివారణ చర్యలు తీసుకోవాలే తప్ప భక్తుల విశ్వాసాలతో ముడిపడిఉన్న అనాదిగా ఆనవాయితీగా వస్తున్న సీతారాముల కల్యాణం రద్దుచేయాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా శతాబ్దాల నుండి వస్తున్న సంప్రదాయాలను పక్కనపెట్టాలన్న టీటీడీ నిర్ణయాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు.