ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థల ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తేనే కరోనా లాంటి వ్యాధులను అరికట్టటం సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 9నెలల కాలంలో ఆదివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తొలిసారి ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో మీడియా సమావేశం బాధాకరంగా ఉందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు చింతించాల్సి వస్తోందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ వ్యవస్థలను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ప్రకటించటమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకేఒక్క అంతర్జాతీయ విమానాశ్రయమని, విశాఖపట్నంలో అన్నిరకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నియంత్రణ చర్యలు చేపట్టారని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఐసొలేషన్ వార్డులను అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించారు. దీన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలంటే స్థానిక పాలకవర్గాలు అవసరమన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు, మేయర్లు ఎన్నికైతే స్థానిక పాలనా వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కరోనా నివారణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, మరింత బాధ్యతగా అధికారులు కూడా పనిచేస్తారని ఆయనన్నారు. స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయటానికి, తద్వారా అధికారులతో చురుగ్గా పనిచేయించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు కలసికట్టుగా పనిచేయటం వల్ల కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఎన్నికల వాయిదాతో ఈ అవకాశం కోల్పోవటమే కాకుండా తీరని నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.