ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల వాయిదా విచక్షణాధికారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 15: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచక్షణాధికారాన్ని ఉపయోగించడం చూస్తే శాసన మండలిలో చోటుచేసుకున్న సంఘటనే పునరావృతం అవుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విచక్షణాధికారాలు ఎందుకు ఉపయోగించాలో తెలియకుండా చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవడం సరికాదన్నారు. గతంలో మూడు రాజధానుల బిల్లు విషయంలో కూడా చంద్రబాబు మండలిలో కూర్చొని తన కనుసన్నలతో చైర్మన్‌ను ప్రభావితం చేశారని, ఇప్పుడు కూడా అదే పునరావృతమైందన్నారు. ఎన్నికలు వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర అధికారులతో కనీసం చర్చించకుండా, కరోనాపై వాస్తవాలు చూడకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. కరోనాపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌ను కలిసి, రాష్ట్రంలో పరిస్థితులపై వివరించారన్నారు. కరోనా వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉందో తెలిపామన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఎటువంటి అంశాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాలని, అటువంటి సంప్రదాయాలేమీ పాటించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో వ్యవస్థల్ని భ్రష్ఠుపట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తే చాలన్నదే చంద్రబాబు ఆలోచనని, అందుకే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సాహసం ఎప్పూడూ చేయలేదన్నారు. జీవీఎంసీకి కూడా దివంగత రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నికలు జరిగాయని, చంద్రబాబు పాలనలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని నిలదీశారు. ఎన్నికలంటే భయపడేది చంద్రబాబేనని, అధికార పార్టీలో ఉంటూ పదవికి రాజీనామా చేసి లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన ధైర్యం జగన్‌దని అన్నారు. అప్పట్లో జగన్‌ను ఓడించేందుకు టీడీపీ ఓట్లు కూడా కాంగ్రెస్‌కే వేయించింది చంద్రబాబు కాదా?, అప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు వ్యవస్థల్ని నియంత్రించడం మానుకుని ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ