ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: కరోనా (కోవిడ్-19) వైరస్‌కు సంబంధించి టెస్టింగ్ ల్యాబ్‌ను విజయవాడలో ప్రారంభించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి ఒక బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకూ వైరస్ అనుమానితులు 70మందికి పరీక్షలు నిర్వహించగా 57మందికి నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. ఒకరికి పాజిటివ్ రాగా, మరో 12మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ 772 మందిని పరిశీలనలో ఉంచగా, 244 మంది 28రోజుల పరిశీలన పూర్తిచేసుకున్నారు. మరో 512మంది పరిశీలనలో ఉండగా, 21మంది ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉన్నారు. 1897 నాటి అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులకు అధికారులు ఇచ్చారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించింది. దగ్గినపుడు, తుమ్మినపుడు, నోరు, ముక్కుకు రుమాలు లేదా తువ్వాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలి. కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చేవారు వైరస్ లక్షణాలు లేకున్నా 28రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.