ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో అంతర్జాతీయ ప్రమాణాల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 15: పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడే ఐఎస్‌ఓ - 50001: 2018 ఇంధన ప్రమాణాలు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. ఈ నూతన ప్రమాణాల అమలుతో పరిశ్రమల్లో విద్యుత్ వినియోగ సమర్థత పెరగటంతో పాటు వృథాను నియంత్రించటం, అంతిమంగా సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇందులోభాగంగా కేంద్ర విద్యుత్‌శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) కార్యదర్శి ఆర్‌కే రాయ్ ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డితో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఏపీలో ఐఎస్‌ఓ-50001 అమలుకు సహకరించాలని కోరారు. పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేందుకు బీఈఈ చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇందులోభాగంగా ఐఎస్‌ఓ అమలు ద్వారా ఆధునిక ఎనర్జీ ఎఫీషియంట్ సాంకేతికతను అన్ని పరిశ్రమలకు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. దీనివల్ల విద్యుత్ వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు పరిశ్రమలకు ఆర్థిక ప్రయోజనాలు సమకూరతాయని చెప్పారు. చౌకధరల్లో నాణ్యమైన విద్యుత్ అందించాలనే ప్రభుత్వ ఆశయ సాధనకు ఇది దోహదకారి అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐఎస్‌ఓ-50001: 2018పై విశాఖపట్నంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల సదస్సు దీనిపై పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించటంలో విజయవంతమైందని బీఈఈ కార్యదర్శి వివరించారు. ఇంధన పొదుపు రంగంలో రాష్ట్రానికి భారీగా అవకాశాలు ఉన్న దృష్ట్యా ఐఎస్‌ఓ ప్రమాణాలు
ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తే పరిశ్రమల్లో ఇంధన, ఉత్పాదక వ్యయాలు తగ్గి లాభాలను ఆర్జించే వీలుంటుందని తెలిపారు. అంతిమంగా ఇది రాష్ట్ర పారిశ్రామికరంగ పురోగతికి ఉపకరిస్తుందని చెప్పారు. దేశంలో వినియోగమవుతున్న మొత్తం విద్యుత్ వినియోగంలో సింహ భాగం (40 శాతం) పారిశ్రామిక రంగంలోనే ఉందన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న 347 ఎంటీఓఈ విద్యుత్ వినియోగం 2031 నాటికి 443.4 ఎంటీఓఈకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పాట్ (పెర్‌ఫార్మ్ అచీవ్, ట్రేడ్) పథకం కింద గుర్తించిన అన్ని పరిశ్రమల్లో తొలుత ఐఎస్‌ఓ 50001 అమలు చేయాలని నిర్ణయించామని వివరించారు. పాట్ స్కీం అమలు ద్వారా 2030 నాటికి దేశంలో 165 ఎంటీఓఈ ఇంధన పొదుపు సాధించాలనే లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. దీని విలువ సుమారు రూ. 1.8 లక్షల కోట్లు ఉంటుందన్నారు. పాట్ మొదటి దశ విజయవంతంగా పూర్తిచేసి 8.67 ఎంటీఓఈ ఇంధన పొదుపు సాధించామని ఇది అసలు లక్ష్యం కంటే 30 శాతం అధికమన్నారు. ఏపీఈఆర్‌సీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్‌ను చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నుంచి అందుకున్న బీఈఈ కార్యదర్శి వినియోగదారుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అభినందించారు. అలాగే రాష్ట్రంలో ఎనర్జీ ఎఫీషియన్సీ అమలుకు గట్టి ప్రోత్సాహం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారులకు, విద్యుత్ రంగానికి, రాష్ట్రానికి ఉపయోగపడే బీఈఈ పథకాలన్నింటికీ తమ సహకారం ఉంటుందని చైర్మన్ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ఎనర్జీ ఎఫీషియన్సీ పకడ్బందీగా అమలు చేసేందుకు పటిష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఆయన డిస్కంలను ఆదేశించారు. ఎనర్జీ ఎఫీషియన్సీతో సహా ఏపీఈఆర్‌సీ తీసుకునే ఏ చర్య అయినా రాష్ట్రంలో చౌక విద్యుత్ ప్రోత్సహించటానికే అని వివరించారు. భవిష్యత్‌లో నిరంతర విద్యుత్‌ను పటిష్టం చేయటంపై దృష్టి సారించామన్నారు. అన్నిరంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ఇది ఆవశ్యకమన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను ఈ ఏడాది టారిఫ్ ఆర్డర్‌లోనే ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారుల సంక్షేమం కంటే ఏపీఈఆర్‌సీకి మరేదీ ఎక్కువ కాదన్నారు. గృహ వినియోగదారులకు కూడా తొలిసారి విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇచ్చామని 99 శాతం మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు.
ఐఎస్‌ఓ - 50001 ఇంధన ప్రమాణాలను తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద డిస్కంల వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలుచేయాలని రాష్ట్ర ఇంధన శాఖ యోచిస్తోంది. ఆపై ఇతర పరిశ్రమలకు విస్తరిస్తే మంచిదని అభిప్రాయ పడుతోందని. ఈవిషయమై రాష్ట్ర పరిశ్రమల శాఖతో చర్చించి ఆ సహకారంతో కార్యాచరణ రూపొందించాలని ఏపీ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) భావిస్తోంది. ఐఎస్‌ఓ - 50001 అమలుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)తో ఎంఓయూ కుదుర్చుకునే విషయాన్ని పరిశీలిస్తోంది.

*చిత్రం... జస్టిస్ నాగార్జున రెడ్డితో ఆర్‌కే రాయ్