ఆంధ్రప్రదేశ్‌

మంత్రి వెలంపల్లి చర్యలు అహంకార పూరితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 17: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కప్పగంతు శివరామశర్మను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బెదిరించడం ఆయన అహంకారానికి నిదర్శనమని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య ఖండించారు. మంగళవారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైసీపీ తరపున పోటీ చేయలేదన్న అక్కసుతో శివరామశర్మపై బలవంతంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టించారని ఆరోపించారు. వారి మాట వినకపోతే, వారి పార్టీలోకి రాకపోతే ఎవరినీ ఉపేక్షించరనే విషయం మంత్రి చర్యతో మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి వెలంపల్లి ఇప్పటికైనా మనసు మార్చుకుని బ్రాహ్మణులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని వేమూరి డిమాండ్ చేశారు.