ఆంధ్రప్రదేశ్‌

పచ్చ పార్టీ నేతలు బాగానే తిరుగుతున్నారుగా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన టీడీపీ నాయకులు కరోనా బూచిని చూపించి ఎన్నికలు వాయిదా వేయించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరోనా వైరస్ అంటున్న పచ్చపార్టీ నేతలు మాత్రం బాగానే తిరుగుతున్నారని మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పెళ్లిళ్లు,
పేరంటాలకూ వెళ్తున్నారన్నారు. మీడియా కాన్ఫరెన్సులు కూడా పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు వాయిదా వేయడం మంచి నిర్ణయం అంటూ ఆనందిస్తున్నారన్నారు. వీరి వ్యవహారం దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుందని, ఇంకెన్ని విచిత్రాలు చూడాలో అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు చంద్రబాబు తెగ ఫీలవుతున్నారన్నారు. ఆరు వారాల వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ.. అని ఎద్దేవా చేశారు. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావా.. అని ప్రశ్నించారు. కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు కూడా ఎంతోదూరంలో లేవు అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

*చిత్రం... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి