ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని, తెలంగాణ రాష్ట్రం తరహాలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఆర్‌పీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. పౌరులంతా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన దుస్థితిని కల్పిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో సీఏఏ, ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారని, అలాగే సీఏఏను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు.