ఆంధ్రప్రదేశ్‌

కరోనాను సమర్థంగా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్నిరకాలా సిద్ధం గా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అంటువ్యాధుల చట్టం-1897లోని 2, 3, 4 సెక్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రాంతానికైనా రాకపోకల్ని నియంత్రించేందుకు కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అధికారం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై మంగళవారం ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ కేసు బాధితుడు కోలుకుంటున్నాడని, మరో 14రోజులు పూర్తయ్యాక మరోసారి శాంపిల్స్‌ను పరీక్షించి విడుదల చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్టవ్య్రాప్తంగా మాస్క్‌లు, శానిటైజర్ల కొరత రానివ్వబోమని హామీ ఇచ్చారు. కోవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
తీసుకుంటున్నామని తెలిపారు. అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతోందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్-19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని కోరారు. వైద్య సలహాల కోసం 104 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కోవిడ్-19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన 852 మంది ప్రయాణికులను గుర్తించామని, వీరిలో 580మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 250 మందికి 28రోజుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యుల పరిశీలనలో 22మంది ఉన్నారని, వంద మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 90మందికి నెగటివ్‌గా తేలిందన్నారు. మరో 9మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కోవిడ్-19 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు వ్యాధి సోకినా, లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, ఇతరులతో కలవరాదన్నారు. 108 వాహనంలో ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు పొందాలని జవహర్‌రెడ్డి సూచించారు.