ఆంధ్రప్రదేశ్‌

అప్పులతో రాష్ట్రాన్ని ముంచేసిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 18: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేసి పోయారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లటానికే చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని బుధవారం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి పోయిన చంద్రబాబు ఓటమి భయంతో రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు రాకుండా రాష్ట్రానికి నష్టం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే ఊహించిన చంద్రబాబు ఎన్నికల జరగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మార్చి 31లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా కుట్ర పన్నారన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లక చంద్రబాబు ఇలాంటి నికృష్టపు పనులకు దిగారంటూ ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.