ఆంధ్రప్రదేశ్‌

కరోనా రహిత మన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కరోనా వైరస్ విశాఖ మన్యం దరి చేరలేదు. కరోనాను కట్డడి చేసేందుకు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఈ భయంకర రక్కసి గిరిజన ప్రాంతంలో అడుగు పెట్టకపోవడంతో ఈ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశ, విదేశీ పర్యాటకులతో నిత్యం కళకళలాడే విశాఖ మన్యం ప్రాంతంలో కరోనా వైరస్ సునాయాసంగా సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఈ ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించిన ప్రాజెక్టు అధికారి బాలాజీ సకాలంలో పకడ్బందీ చర్యలు తీసుకుని కరోనా నుంచి మన్యాన్ని కాపాడడంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పర్యాటకుల కారణంగా మన్యానికి కరోనా వ్యాపించే అవకాశం ఉండడంతో పర్యాటక సందర్శిత ప్రాంతాలను పూర్తిగా మూసి వేయడమే కాకుండా మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి ఎవరూ రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. మన్యంలోకి ప్రవేశించే అన్ని దారులను ప్రాజెక్టు అధికారి మూయించి ఈ ప్రాంతాన్ని అష్ట దిగ్బంధం చేశారు. మన్యంలో నిత్యం జరిగే వారపు సంతలను సైతం రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయించడమే కాకుండా లాక్‌డౌన్‌కు ముందే ఈ ప్రాంతంలోకి చొరబడిన మైదాన ప్రాంత వాసులను, విదేశీయులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు వంద మందిని గుర్తించి వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈమేరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాలలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేసి అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చిన వారిని సైతం 14 రోజులకు పైగానే క్వారంటైన్ కేంద్రాలలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం కూడా మన్యానికి మేలు చేకూరిందనే చెప్పాలి. కరోనాపై గిరిజనులకు సంపూర్ణంగా అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో వైద్య, రెవిన్యూ, సచివాలయ సిబ్బందితో ఒకవైపు ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకురావడమే కాకుండా మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో కరోనా రక్కసి మన్యం దరి చేరలేదనే చెప్పాలి.