ఆంధ్రప్రదేశ్‌

కష్టకాలంలో కాపు కాయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఏప్రిల్ 13: కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కాపు కాసి యూతనివ్వాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం చిట్టినగర్‌లోని శ్రీగౌతమ్ విద్యాలయం స్మార్ట్ క్యాంపస్‌లో మంత్రి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు ఈ కిట్‌లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలకు, తన సిబ్బందికి చేయూతనిచ్చిన సూర్యారావుని మంత్రి అభినందించారు. రూ. 2 లక్షల విలువైన సరుకుల పంపిణీ చేయడంతో పాటు కూరగాయలు కూడా అందించారు. లబ్ధిదారులను సామాజిక దూరం పాటింపజేసి వారి అవసరాలను ఆదుకోవడం ఎంతో గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్‌క్లబ్ కార్యదర్శి ఈశ్వరరావు, ప్రోగ్రాం కమిటీ చైర్‌పర్సన్ బలివాడ శివకుమార్ పట్నాయక్, ఎన్‌వి రావు, పుప్పాల ఏడుకొండలు, వేముల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... నిత్యావసర సరుకుల కిట్‌లు అందిస్తున్న మంత్రి వెలంపల్లి