ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు జిల్లాలో 93కి చేరిన కరోనా బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారందరూ ఐసోలేషన్, క్వారంటైన్‌లకు పంపిన అనంతరం కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలో సోమవారం నాటికి 93 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య వందకు చేరుతోంది. కొత్తగా నమోదైన 8 కేసుల్లో 6 గుంటూరు నగరంలోనే నమోదు కాగా, 2 నర్సరావుపేటలో నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో పోలీసులు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. వైరస్ విస్తరించకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు నగరంలో రోజు మార్చి రోజు లాక్‌డౌన్‌ను సడలించారు.
ఇప్పటికే నగరంలో 9 రెడ్‌జోన్‌లు ప్రకటించగా, తాజాగా కేసులు అధికమవడంతో రెడ్‌జోన్‌ల సంఖ్యను పెంచే యోచనలో అధికార యంత్రాంగం తలమునకలైంది. దీంతో రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు నిలవడంతో ఇటు వైద్యులు, అటు అధికార యంత్రాంగం నూతన కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కసరత్తు చేస్తున్నారు. సోమవారం నాటికి 380 శ్యాంపిల్స్‌కు సంబంధించి నివేదికలు రావాల్సి ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. కాగా నూతనంగా నమోదైన 8 కేసుల్లో ఆనందపేటలో 4, సంగడిగుంట 1, నర్సరావుపేట 2, కొరిటెపాడులో 1 కేసులు చొప్పున నమోదయ్యాయి. దీంతో నగరంలో కంటోనె్మంట్ జోన్‌లు పెంచేవిధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చి తిరగవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.