S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/29/2017 - 20:21

దీపం వెలిగిస్తే చీకటి భయపడుతుందా
తన కాయానికి గాయమవుతుందని
చీకటి గాయానికి భయపడితే సృష్టికి వెలుగుండదు
జడిగడియన నీలినింగి ఉలిక్కిపడుతుందా
మెరుపు తన దేహానికి చురక పెడుతుందని
వానకి ఆకసం జడిస్తే పుడమి గర్భం దాల్చదు
కోత తప్పదని విత్తనం మొలకెత్తనంటే
ఆ విత్తనం వంశం అక్కడితో అంతమవుతుంది
మోత ఎందుకని మబ్బు ఒకేసారి వర్షిస్తే

10/29/2017 - 20:20

నచర్యల్లాంటి కవితలు రాసి, కొందరి పెద్దకవుల గళాలే మొద్దులూ బారిన వేళ... ఆకాశాన్నంతా ఒక్కసారి చూపగల్గే కొంగ్రొత్త మెరుపులు మన హృదయాల్ని కుదిపి లోగొంటాయి. చిరుమొక్కలు పెద్ద పువ్వుల్ని పూసిన చిత్రమైన ప్రాకృతిక వేళల్లో - వికసించే రేకు బాకుల్ని చూసి, వాటి కాంతుల్ని చూసి, విప్పారిన యోచనానేత్రాలతో విభ్రాంతికి గురవుతాం.

10/29/2017 - 20:19

చేపల్ని తింటావ్
చెరువుల్ని మింగుతావ్
ఇంకా..
హంసలనెందుకు వేటాడుతున్నావ్
జీవ విధ్వంసానికెందుకు ఒడిగడుతున్నావ్..
నువ్వు గొప్పగా అంతం చేసిన ఏ బతుకైనా
నీలాగే సామాన్యంగా మొదలయ్యిందని తెలుసుకో..
కొడుకో కూతురో..
నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని
నువ్వంతగా ప్రేమిస్తావ్ కదా..
చెట్టో పిట్టో..
నీలో రక్తాన్ని వృద్ధిచేసిన ప్రకృతిని

10/29/2017 - 20:17

‘సావిత్రి కూడా నవ్వగలిగినంతా నవ్వింది. నారాయుణ్ణి కలుసుకున్న కొత్తలో తను నవ్విన నవ్వులాగే ఉండాలి నవ్వు అని ఎంతగానో ప్రయత్నించింది. వాడికన్నా రెట్టింపు ఉత్సాహం చూపించింది. ఆ చిన్న అరుగుమీద, వాళ్లు పడుకున్న కొద్ది జాగాలోనే నారాయుడికి వీలుగా దొరక్కుండా అటూ యిటూ దొర్లి ఏడిపించింది. పొంగిపోతున్న వాడి ఒంటిలో నరనరాన్ని సవాలనే మెలేసింది. వాడితో తనూ మెలికిలు తిరిగింది’-

10/22/2017 - 21:55

‘‘రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు’’ అన్నది నిజం.

10/22/2017 - 21:54

ఆ.వె. కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి
కట్టువడని విశ్వకవివి నీవు
తరతరాల కుళ్లు కడిగివేయుటకెత్తి
పట్టినావు కలము గట్టిగాను

ఆ.వె. నీ కులమ్ము జూచి నినే్నడిపించిన
వారికంటె - ముందు వరుస లోన
నిలిచి - ప్రతిభ జూపి - నిఖిలాంధ్ర దేశమ్ము
గర్వపడగ కలము గడిపినావు

10/22/2017 - 21:54

ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో డిసెంబర్‌లో నిర్వహించే వైజాగ్ ఫెస్ట్‌లో భాగంగా కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. నేటి సామాజిక సవాళ్లకు తగిన స్థాయలో ఉండేలా తెలుగు రాష్ట్రాల్లోని కవులు, రచయతలు తమ రచనలు పంపాలని కోరింది. రచనలను నవంబర్ 10వ తేదీలోగా చీకటి దివాకర్, 1-17/1, ప్లాట్ నెం.84, ఆదిత్యానగర్, కంటోనె్మంట్, విజయనగరం - 535 003 చిరునామాకు పంపించాలి.

10/22/2017 - 21:53

నువ్వెళ్లావా అందమా
నయాగరా
నిలిచిపోయింది

తేలుతూ వస్తున్న చీకటే
తోడు
నది ఏకాంతానికి

బరువెక్కింది
పెయింటింగ్
ఎన్ని చూపులు వాలాయో

సాయం సంధ్యని
నది తీసుకుపోయిందేమో
చీకటి

ప్రవహిస్తున్న
వర్ణచిత్రాలు
నది కాన్వాసుపైన

10/22/2017 - 21:52

మిత్రమా!
కునే్నలోని పురుగు
పాకుతూనో దొర్లుతూనో
లక్ష్యంవైపు వెళ్తుందే కానీ

రాబందుల పొట్టల్లో బ్రతికే
నట్టలకు సోయని పుట్టించలేదు

కీటకం లద్దిని తిని
నేలను శుద్ధి చేస్తుందే కానీ

పచ్చని గరిక తిని లద్దిని
విసర్జించే గార్ద్భానికి
ఆదర్శం కాజాలదు

అయనా మిత్రమా
ఊడిగాలకు తెగబడ్డ ప్రాణులను
అక్షరాలు ఏనాడో వెలివేశాయ

10/22/2017 - 21:51

మా దేహాలైనా
మా జీవితాలైనా అపరిశుభ్ర కారణం
మీ మనసుల మురికే గదా...
మేం అగాధాలలో పడిపోటానికి కారణం
మీరు అకస్మాత్తుగా
ఉన్నత శిఖరాలకు చేరటమే గదా...

మీ మనస్సులలో డ్రైనేజీ పారుతూ...
దుష్ట క్రిమి కీటకాలు నిరంతరం పెరుగుతూ...

మా దేహాల స్వేద పరిమళం
మీరే గదా గతుకుతున్నారు
మీ దేహాల బద్ధకం కంపు
మాకే గదా అతుకుతున్నారు

Pages