S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/22/2017 - 21:49

ఆకలి లేని కాలాలు
అబలలు లేని దేశాలు
మాయలేని మనుషులు
మాసిపోని మమతలు
ఉంటే బాగుండును

రైతుకి కష్టాలు
నేతకి నష్టాలు
బాల్యానికి బరువులు
బరువైన బ్రతుకులు
పోతే బాగుండును

స్వార్థానికి సంకెళ్ళు
అవినీతికి ఉరిత్రాళ్ళు
పడితే బాగుండును

న్యాయానికి కళ్ళు
ధర్మానికి పాదాలు
పుడితే బాగుండును

10/22/2017 - 21:48

‘్ఫతీమా’ అందగత్తె. పనిలో చురుకు. అన్ని విధాలా దంపతులకి తలలో నాలికలా మెలిగేది. వాళ్ల ఇంట్లో నలుగురు పనిమనుషులు. వంట మనిషీ, గినె్నలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులకే ఒక మనిషి, బయట తోటమాలి! వీళ్లందరిమీద అజమాయిషీ ఫతీమా. ఇలాంటి ముఖ్యమైన పనిమనిషిని- అజమాయిషీ చేసే మనిషిని ఆ దంపతులు ఉద్యోగం నుంచి తీసేశారు.

10/17/2017 - 21:00

సాహిత్యం సమాజంపై ప్రభావం చూపించే విధానం అత్యంత సున్నితంగా ఉంటుంది. ఒక రచన పాఠకుడి మెదడులోకి భూమిలోకి నీరు ఇంకిన విధంగా ఇంకుతుంది. అలా ఇంకిన నీటికి మహావృక్షంగా ఎదగగల బీజం తారసపడితే నీరు ఆ బీజంలో కదలిక తెచ్చి మొక్కకు ప్రాణం పోసే విధంగా వ్యక్తిలోని ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. ఆలోచనలకు దిశనిచ్చి నిర్ణయాలను పరోక్షంగా ప్రభావం చేస్తుంది. సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగా కనిపించకున్నా పరోక్షంగా ఉంటుంది.

10/17/2017 - 21:00

ఆ కళ్లు కొత్త భాషపై అక్షరాలు రుద్ది
హృదయంలోని భావాలను
చేతివ్రేళ్లపైన ఆడిస్తాయి
ఆ వ్రేళ్ళేమో మనిషికి - మనిషికి మధ్యన
జవాబుదారిగా నిలుస్తాయి

ఆ కళ్ళు సృష్టించిన కొత్త భాషతో
ప్రపంచపు భాషామోము మూగదవుతుంది
నీ భాష నీది - నా భాష నాది అనే ఆ కళ్ళూ
చెవులకు - నోటికి పని లేకుండా చేస్తాయి.

10/17/2017 - 20:59

అద్దం పగిలిందా
రాయిని కాదు ప్రశ్నించాల్సింది
విసిరిన చేయిని!

పగిలిందని ఎగిరి గంతేయకు
నీ వికృత రూపాన్ని
అది వేయి ముఖాలుగా చేసి
లోకానికి పట్టిచ్చింది!

నన్ను చూసి కన్ను మండిందా
చల్లార్చాల్సింది కంటిని కాదు
నీలోన మండుతున్న అసూయని!

ఆర్పకపోతేనేం
భావించావా లోలోన?
నిలువునా దహించేది నినే్న!

10/17/2017 - 20:58

మహాకవి శేషేంద్ర 90వ జయంతిని పురస్క రించుకుని ఈ నెల 20వ తేదీ సాయంత్రం త్యాగరాయ గానసభలో సాహిత్య సదస్సు నిర్వహి స్తున్నట్లు గానసభ అధ్యక్షులు వి.ఎస్.జనార్ధనమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఆచార్య కె. యాదగిరి కీలకోపన్యాసం చేస్తారు. ముఖ్య అతిథిగా జిహెచ్‌ఎంసి ఉప కమీషనర్ డా. ఎన్. యాదగిరి, ఆత్మీయ అతిథిగా ఆచార్య ననుమాస స్వామి, ప్రముఖ సాహితీవేత్త వి.ఎస్.ఆర్.ఎస్.

10/17/2017 - 20:57

కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సమాఖ్య సంయుక్త నిర్వహణలో ప్రముఖ కవి శిఖామణి ఆరుపదుల సాహితీ ఉత్సవాన్ని ఈ నెల 29వ తేదీ ఉ. 9.30 నుంచి యానాంలో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షులు దాట్ల దేవదానం రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు శిఖామణి సాహితీ పురస్కార ప్రదానంతో పలు గ్రంథాలను కూడా ఆవిష్కరిస్తారు. శిఖామణి పరిశోధకులకు సత్కారం, కాళోజీ అవార్డు గ్రహీత డా.

10/17/2017 - 20:57

పుష్ప పరిమళాన్ని ఆఘ్రాణిస్తాం
కారణమైన పూవును మరుస్తాం
నాలుక తో రుచిని చవి చూస్తా
పంట చేసిన చేయిని విస్మరిస్తాం
కీర్తి పతాక ఎగరేస్తాం
మోసిన చేతులను దులిపేస్తాం
కమ్మదనం జుర్రుకుంటూ
స్వేదప్రాణిని ఛీ కొడతాం.

10/17/2017 - 20:55

గత వారం ‘సాహితి’లో ప్రచురితమైన జె.ప్రసాదరావు వ్యాసం ‘సమ భావమే సాహిత్య ధర్మం’లో స్పష్టత లోపించింది. అసలు సమభావం అంటే ఏమిటి? సాహిత్యంలో ఆ సమభావాన్ని సాధించటానికి గల పద్ధతులు ఎలాంటివో కనీసం సూత్రప్రాయంగానైనా రచయిత చెప్పలేకపోయారు.

10/17/2017 - 20:54

ప్రతిరోజు
ఓ సరికొత్త పేజీనే
క్షణానికో ప్రశ్నోదయం
అక్షరాల్లేని పుస్తకాల్లో
సమాధానాల కోసం వెతుకులాట!
అనుభవాల కలం
అనుభూతుల గతాన్ని లిఖిస్తుంది
మార్కుల్లేవు కాని
నిమిషానికో పరీక్ష!
అలుపెరగని నిత్య సాధన
అందులేని సత్య శోధన
వర్తమానపు గొంతుతో
వల్లె వేస్తూనే వుండాలి
మానిన గాయాల అడుగు జాడల్ని

Pages