సాహితి

భయపడకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేపల్ని తింటావ్
చెరువుల్ని మింగుతావ్
ఇంకా..
హంసలనెందుకు వేటాడుతున్నావ్
జీవ విధ్వంసానికెందుకు ఒడిగడుతున్నావ్..
నువ్వు గొప్పగా అంతం చేసిన ఏ బతుకైనా
నీలాగే సామాన్యంగా మొదలయ్యిందని తెలుసుకో..
కొడుకో కూతురో..
నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని
నువ్వంతగా ప్రేమిస్తావ్ కదా..
చెట్టో పిట్టో..
నీలో రక్తాన్ని వృద్ధిచేసిన ప్రకృతిని
ఎందుకలా నాశనం చేస్తావ్..
చెట్టు ఎదిగేందుకు హద్దుంది
పిట్ట ఎగిరేందుకు అవధుంది
అన్నిటినీ మించి ప్రకృతిని ఆక్రమించి
మనిషీ మరుగుజ్జువు ఎందుకయ్యావ్
నువ్వు జన్మనిచ్చిన వారిని
కంటికి రెప్పలా కాపాడుతావ్ కావలి కాస్తావ్ కదా
నీకు జన్మనిచ్చిన ప్రకృతినెందుకు నాశనం చేస్తున్నావ్
పాత వస్తువులనో ప్రాణం లేని వాటినో
మ్యూజియంలో ప్రదర్శించినట్లు
బ్రతికున్న జంతువులు పక్షులనెందుకు జూలో బంధిస్తావ్
రోజూ నీటి అద్దంలో
తమ ప్రతిబింబాలను చూసుకుంటూ
ఏక ముఖాల కొండా కోన
బహుముఖాల మనిషీ మరి నీకెన్ని అద్దాలు కావాలి
నీలో ఎనె్నన్ని అర్థాలు వెతకాలి
నువ్వు తలను నరికినా పచ్చని చేతులతో
నిన్ను అక్కున చేర్చుకునే
ప్రకృతి నీకేం ధైర్యం చెపుతుందో తెలుసా..
భయపడకు భయపడకు జీవించడానికి భయపడకు...

- కంచర్ల శ్రీనివాస్