S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/11/2017 - 00:30

నువ్వెవరివైనా నవ్వు నీకందం
తోటివారిలోనూ నవ్వుల పువ్వులు
పూయంచగలిగితే మరింత అందం

నోటితో నవ్వుతూ
నొసటితో వెక్కిరించడం కాక
ఎవరినైనా నువ్వు
మాటతో మనసుతో
చూపుతో చేష్టతో
హాస్యం మేళవించి
వారివారి చింతలు చికాకులు
అన్నింటిని కాకున్నా
కొన్నింటినైనా దూరం చెయ్యగలవు

12/11/2017 - 00:29

సాహితీ తోటలో విరబూసిన ఓ గులాబీవి
అక్షరం విత్తుని భూమి పుస్తకంలో నాటిన
అసలు సిసలైన రైతువి
మట్టిని బంగారంగా మలిచిన
ఓ అరుదైన కవిత్వ శిఖరానివి
ప్రేమకు కొత్త రంగులు అద్దిన
ప్రేమైకమూర్తివి
ఏ దారిన ఎటు పయనిస్తావో
ఊహించడం కష్టమే
ఈ క్షణాన కులమతాలు రూపుమాపే
సంఘ సేవకుడివి
మరు నిముషాన పశుపక్ష్యాదుల కోసం
తాపత్రయపడే జాలి కెరటానివి

12/11/2017 - 00:29

ప్రముఖ సినీ గేయ రచయత, కవి సుద్దాల అశోక్‌తేజ ఈ ఏడాది మువ్వా పద్మావతి రంగయ్య అవార్డుకు ఎంపికైనట్లు నిర్వాహకులు క్రాంతి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ గేయ రచయతగా జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డులను కూడా అశోక్ తేజ అందుకున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతులమీదుగా ఈ అవార్డును అందించనున్నారు.

12/11/2017 - 00:28

ఇక మొగ్గ తొడగడం వుండదనే
స్థితి తెలిసినప్పుడు
దించుకోలేని దిగులు

ఇన్నినాళ్లు
ఎగిరెగిరిపడిన కోరికలు
సహజంగా ఇంకిపోతున్నాయనే
గతి ఎరిగినప్పుడు
పంచుకోలేని వగపు

బీపీ, తీపీ కలగల్సిన పెయ్య
దినమంతా చేదు ఎక్కుతుంది

12/11/2017 - 00:27

అనాథల ఆక్రందనలు, అన్నార్తుల ఆవేదనలు, అభాగ్యుల ఆర్తనాదాలు, అసమర్థుల ఆత్మకథలు, మోసపోయిన వారి బాధలు, కలలు కల్లలైన కన్నీటి గాథలు - వెరసి పెద్ద్భిట్ల సుబ్బరామయ్య కథలు. పెట్టుబడిదారీ సమాజం వికృత స్వరూపాన్ని, దయలేని దోపిడీదారులు, వారి పదఘట్టనల కింద నలిగిపోతున్న వారి జీవితాలను అక్షర చిత్రాల్లో ఆవిష్కరించిన అసామాన్య కథకులు పెద్ద్భిట్ల.

12/11/2017 - 00:26

‘ఒకానొక ప్రముఖ ఆంగ్లపత్రిక ఫొటోగ్రాఫర్‌గా ప్రపంచంలో చూసిన అనేకానేక దేశాల్లో సైతం ఇంతటి శోభాయమానమయిన ప్రకృతిని తాను చూడలేదనుకున్నాడు- చక్రవర్తి’

12/03/2017 - 21:27

‘‘శ్రీలు పొంగునట్టి పాలకడలి బిడ్డ
తెలుగు గడ్డ మనకు వెలుగు గడ్డ
అఖిల భారతాంబ కందాల వీణరా
తెలివి కలిగి మెలగు తెలుగు బిడ్డా’’

12/03/2017 - 21:25

మన మాటల చూపులు
మొదటిసారి కలిసినప్పుడే
నీ రెక్కల్ని చూశాను
ముడుచుకుని
భయంభయంగా సర్దుకుంటూండగా
అస్తిత్వాన్ని దాచుకోలేక
సంకోచంగా అటూ ఇటూ కదులుతుండగా..

ఎగిరే వాంఛని
ఈకలుగా మొలిపించుకొన్న రెక్కలు
ఎంతందమైనవి!
ఎంత శక్తి దాగుంది వాటిలో!

ప్రియమైన పాలపిట్టా
సందేహించకు
రెక్కల్ని విప్పారనివ్వు

12/03/2017 - 21:24

తెల్లని మల్లెల సువాసనలందించింది
పచ్చని చేమంతుల పూబంతుల
అందాలను పంచింది
గులాబీ పరిమళాల గుబాళించింది
పత్రహరితం నింపి చెట్ల ఆకుల నీడనిచ్చింది
అందమంటే తెలిపింది ఆనందమంటే తెలిపింది

12/03/2017 - 21:23

ఎగిరెల్లిపోవాలి
అప్పుడప్పుడూ.. వున్నచోటునుండి.

Pages