S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/07/2018 - 21:11

సమాజ హితం కోరేది సాహిత్యం. సాహిత్యాన్ని సృష్టించేవారు సృజనకారులు. సామాజిక చైతన్యం కోసం కవులు, రచయతలు రచనలు చేస్తారు. సమాజానికి దిశా నిర్దేశనం చేస్తారు. రుగ్మతలను రూపుమాపుతారు. పాలకులను సరియైన మార్గంలో నడిపించేందుకు ప్రజా సమస్యలను తమ రచనల్లో ప్రతిబింబింపచేసి ప్రజల పక్షాన నిలుస్తారు. సామాజిక బాధ్యతే పరమావధిగా రచనలు చేసే కవులు, రచయితలను సత్కరించే సంప్రదాయం అనాదినుంచీ ఉంది. అయితే..

01/07/2018 - 21:09

‘శేషయ్య కోటు జేబులోనుంచి కలం తీశాడు. టేబుల్‌మీది కాగితం తీయబోయి మానుకుని జేబులోని భగవద్గీత పుస్తకం తీశాడు. దానిమధ్య మడిచి ఉన్న తెల్ల కాగితం తీశాడు. ఆ క్షణాన ఆయన మనసులాగున నలిగి ఉన్నది ఆ కాగితం. ఆ పోలిక గుర్తుకు వచ్చి నవ్వుకున్నారాయన. నవ్వుకుని అమ్మవారి వైపు చూస్తే ఆమె ప్రశాంతంగా చూచింది. గబగబా ఉత్తరం రాశారు. శేషయ్య సంతకం పెట్టారు. తరువాత తారీకు వేయబోయి కేలండరు వైపు చూచాడు.

12/31/2017 - 22:00

కొత్త క్యాలెండర్ వచ్చిందని
రోజూ వచ్చే ఉదయం మారదు
విచ్చుకునే పుష్పం ఆగదు
కొత్త సంవత్సరం వచ్చిందని
రోజూ సాయంత్రం సూర్యుడికి చీకటి మసిపూయక మానదు
వెలుతురు బంగారం దోచుకోవడం ఆపదు

12/31/2017 - 21:59

వస్తూ పోతున్నాయి
వత్సరాలెన్నో
వడి వడిగా విచ్చేస్తూ
వలపును పంచుతూ

నిత్యనూతనంగా
నిండు యవ్వనంతో
నిటారుగా నిలబడుతూ
నిజాల్ని గమనిస్తూ

సహజత్వాన్ని ఆహ్వానిస్తూ
సక్రమ మార్గాల్ని ఆశిస్తూ
సకల జనుల క్షేమం కోసం
సద్వినియోగ ఆశల కోసం

12/31/2017 - 21:58

అరుణ కిరణాల గిలిగింతలకు,
కితకితలకు,
కించిత్తు బద్ధకంగా ఒళ్లు విరుచుకొనే
నిర్లిప్తతకు నిలువుటద్దం,
ఆనందానికి అవరోధం,
పొంగివచ్చే దుఃఖం పేరుకుపోయినట్లు
ప్రయాణ పురోగమనానికి ప్రమాద హేతువు
శతృశిబిర నిఘా నేత్రానికి అడ్డుతెరలా
సువిశాల శే్వత కుడ్యం
సుదూర శే్వతనగం
ప్రేమికుల పెన్నిధి
వృద్ధ, వ్యాధిగ్రస్తుల నిషేధం

12/31/2017 - 21:57

కొత్త ఏడాది మళ్లా మున్నూటరవై అయిదు వేకువలను తీసుకురాబోతున్నది. వెయ్యేళ్ళ ముందర శాసన హోదా గల భాషగా, ఒక సహస్రం నుంచి సృజన సంపదగా, నన్నయ, పాల్కురికి రెండు తీరులుగా అందించిన రచనలుగా వేల పదాలు మన ముందర కుప్పలుగా పడివున్నాయి. అవి ప్రతి శతాబ్దంలో విస్తృతమవుతూ వచ్చాయి. గత వెయ్యేళ్లుగా నిర్విరామ సాహిత్య రచన భిన్న రూపాల్లో జరుగుతూనే ఉన్నది.

12/31/2017 - 21:56

నూతన సంవత్సరానికి స్వాగతిస్తూనే
నూతన ఆలోచనల సరళిని కూడా
స్వాగతమివ్వాలి
నూతన సంవత్సరమంటేనే హృదయం నిండా
నూతన భావాలతో కూడిన ప్రణాళికలను
సిద్ధపరచుకోవడం
కొత్త ఆశయాలకు జన్మనివ్వడం

12/31/2017 - 21:55

కలం, గళం
కలగలిస్తే చైతన్యం

చైతన్యం చేవతో చచ్చిపోదా
సమస్య చిన్నదై

కాలం, కార్యం జోడిస్తే
జయం నీదే

నడిచి వచ్చేకాలం
నీ జయమై, నీలో విజయనాదమై
వచ్చే వత్సరమొస్తుంది వడి వడిగా
నూతన సంవత్సరమొస్తుంది
నూతనోత్సాహంతో
స్వాగతిద్దాం - సాధిద్దాం
*
- వెంకటేష్, కరీంనగర్

12/26/2017 - 20:50

కేంద్రంలో సకల భారతీయ భాషల ఏక సంస్కృతిని, వారసత్వాన్ని, సాహిత్య రీతులను ఆసేతు హిమాచలం ఆత్మీయం చేసే మహత్తరాదర్శంతో ప్రభవించింది కేంద్ర సాహిత్య అకాడమి. ఇప్పటికి ఇంచుమించు 66 సంవత్సరాలుగా ఈ గొప్ప సంస్థ తన ఉనికిని ప్రకటించుకుంటున్నది. కొన్ని వేల ప్రచురణలను, కొన్ని వందల సదస్సులు, గోష్ఠులు, భారతీయ విశిష్ట రచయితల జయంతులు ఈ సంస్థ నిర్వహించి ఉండవచ్చు.

12/26/2017 - 20:48

సగం చీకటి భూమిపై రాలిపడి
మిగిలిన సగం జలపాతంలా
గగనం నుండి
దూకుతున్న సమయాన
విశ్వాన్ని గర్భంలో
దాచుకున్న ఆ తల్లి
కోటానుకోట్ల సూర్యకిరణాలను
పండువెనె్నలను ముద్దలుగా కలిపి
మాయపు ప్రపంచంలోకి
రక్తపు మరకలతో ఒక కాంతిని తోసింది
ఆ కాంతి యొక్క రక్తపు మరకలు
మా దేహాలకు
రేగికంపలా అతుక్కున్న పాపాన్ని కడిగి

Pages