క్రైమ్/లీగల్

మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పలు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రాష్ట్రప్రభుత్వం కొత్త కమిషనర్‌గా మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. ఈ అంశంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై హైకోర్టులో ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటీషన్లపై సోమవారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈనెల 16వ తేదీ నాటికి ప్రమాణ పత్రం దాఖలు చేయాలని, తదుపరి విచారణకై కేసును 20వ తేదీకి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు కనీసం నెల రోజుల పాటు తమకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టును అభ్యర్థించగా తోసిపుచ్చింది. మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఈనెల 17వ తేదీలోగా మరే ఇతర అభ్యర్థనలు ఉన్నా తెలియజేయాలని కోర్టు పేర్కొంది. అన్ని కేసులపై వాదనలను 20వ తేదీనే వింటామని హైకోర్టు పేర్కొంది. అడ్వకేట్ జనరల్ ఈ కేసును సర్వీసు మ్యాటర్‌గా పరిగణించాలని, మిగిలిన పిటీషన్లు తోసిపుచ్చాలని పేర్కొన్నారు. ఇసి తొలగింపుపై తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తదితరులు పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషనర్ల తరపున న్యాయవాదుల్లో ఒకరైన జంధ్యాల రవిశంకర్ ఈ కేసులో ప్రజా శ్రేయస్సు కూడా ఉందని, అందువలన తాము పిల్ వేశామని చెప్పారు. ఈ పిటీషన్ల సమాచారాన్ని అడ్వకేట్ జనరల్‌కు అందించాలని అన్ని కేసుల్లో 20వ తేదీన వినేందుకు వాయిదా వేసింది.