S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/16/2019 - 04:39

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించడాన్ని సవాలు చేస్తూ 8 ఏళ్ల విద్యార్థి అఖిల్ కాశిరెడ్డి, అతని తండ్రి శశిధర్ కాశిరెడ్డిల తరఫున సీ నరేష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యాసంస్థల బంద్ అక్రమమని అఖిల్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు.

10/15/2019 - 23:24

హైదరాబాద్, అక్టోబర్ 15: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు మంగళవారం కొట్టివేసింది. గత వారం రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఈ దశలో లేదని పేర్కొంది.

10/15/2019 - 04:48

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం హెల్ప్‌లైన్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆర్టీసీ సమ్మె పట్ల సీఎంను నిందించినట్టు పత్రికల్లో, చానల్స్‌ల్లో, సోషల్ మీడియాలో ప్రచురితమైన, ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని సీఎంఓ అధికారులు ఖండించారు. వైరల్ అయిన ఆడియో ఫేక్‌గా పేర్కొన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సోమవారం నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

10/15/2019 - 04:12

సోంపేట, అక్టోబర్ 14: విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా సోంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు సోంపేట చాకలివీధికి చెందిన కె.సోమేశ్వరరావు(32), పల్లివీధికి చెందిన లోకేష్ (36) విద్యుదాఘాతంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

10/15/2019 - 02:10

గన్నవరం, అక్టోబర్ 14: ఎటిఎం కేంద్రాలలో నగదు తీసుకోవటం చేతగాని మహిళలను, వృద్ధులను టార్గెట్‌గా పెట్టుకుని, వారిని ఏమార్చి వారి ఖాతాలలోని డబ్బు తీసుకునే అంతర్‌జిల్లా కేటుగాడు చింతల సురేష్‌బాబును అరెస్టు చేసి, అతని వద్ద నుండి 5.46 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ నగర డీసీపీ హర్షవర్ధన్, ఎసిపి సురేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు.

10/15/2019 - 01:36

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆదాయం పన్ను అధికారులు సోమవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఖాతాలు (అకౌంట్స్) నిర్వహించే పలువురు సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఆదాయం పన్ను అధికారులతోపాటు కేంద్ర ఆర్థిక శాఖలోని విజిలెన్స్ విభాగం అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొనట్లు తెలిసింది.

10/15/2019 - 01:35

న్యూఢిల్లీ: ఆందోళనకరంగా మారిన నకిలీ, పెయిడ్ న్యూస్‌ల పరిశీలనకు సంబంధించి సామాజిక మాధ్యమాల ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. అయితే, దీనికి సంబంధించి స్వేచ్ఛగా హైకోర్టును ఆశ్రయించవచ్చని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

10/15/2019 - 01:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను తదుపరి విచారణ నిమిత్తం అరెస్టు చేసేందుకు అనుమతించాలన్న ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు తమ నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తానని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ సోమవారం చెప్పారు.

10/15/2019 - 01:01

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రస్తుత సచివాలయంలో ఏపీ ఖాళీ చేసిన భవనాలు ఉన్నాయి కదా? అవి చాలడం లేదా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది. భవనాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు వాదనలు వినిపించారు.

10/15/2019 - 00:35

చిత్తూరు: చిత్తూరు జిల్లా యాదమరి అమరరాజ పరిశ్రమ వద్ద ఉన్న ఆంధ్రా బ్యాంకులో చోరీ వ్యవహారం సోమవారం వెలుగు చూసింది. బ్యాంకుకు వేసిన తాళాలు వేసి నట్లుగానే ఉండగా బ్యాంకు లాకర్లల్లో ఉన్న బంగారు నగలు, నగదు అపహరణకు గురికావడంతో బ్యాంకు సిబ్బందిపైనే పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Pages