S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/08/2019 - 01:46

ఉప్పల్, అక్టోబర్ 7: ఉప్పల్ బాలాజీ ఎన్‌క్లేవ్ సమీపంలోని సర్వే నెంబర్ 34, 35, 36, 37, 39లోని ఆరు ఎకరాల 11 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని పీర్జాదిగూడ విష్ణుపురి కాలనీకి చెందిన రాచెరువు దేవా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై సెక్షన్ 447, 427, 506, ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

10/08/2019 - 01:45

వనస్థలిపురం, అక్టోబర్ 7: నాగోలులో నివాసం ఉంటున్న వివాహితురాలు అమెరికాలో అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలు సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వనిత(38) ఎల్బీనగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన రాచకొండ శివ కుమార్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

10/08/2019 - 01:21

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏసీబీ అధికారులు 13 వ్యక్తులను అరెస్టు చేశారు. తాజాగా సోమవారం ఈ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీ అరవింద్ రెడ్డితో పాటు కె.లిఖిత్ రెడ్డి, కె.అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

10/08/2019 - 00:45

విజయవాడ, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ మహేశ్వరితో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

10/07/2019 - 23:44

నెల్లూరు : రాష్ట్రంలోని విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను, వారికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను నెల్లూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

10/07/2019 - 06:22

రామభద్రపురం, అక్టోబర్ 6: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం టీవీఎస్ ఎక్సెల్ బైక్‌పై వెళుతున్న ముగ్గురు విద్యార్థులను విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళుతున్న గ్యాస్ ట్యాంకర్ లారీ ఢీకొంది.

10/07/2019 - 05:39

ముంబయి, అక్టోబర్ 6: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరున్ని పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. రియాజ్ భాటి (50) శుక్రవారం దక్షిణ ముంబయిలోని క్రాఫోర్డు మార్కెట్‌లో ఓ వ్యాపారి నుంచి బలవంతంగా ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. భాటితో పాటు ఆయన సోదరునిపైనా బలవంతపు వసూళ్ళకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

10/07/2019 - 05:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో శాస్తవ్రేత్తనని తనను నమ్మించి, వివాహం చేసుకున్నాడని భర్తపై ఓ భార్య కేసు పెట్టింది. పీహెచ్‌డీ చేస్తున్న ఆమె తన భర్త జితేందర్ ఇస్రోలో పనిచేస్తున్నట్టు వివాహానికి ముందు చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి తాను ఎంటెక్ చదివానని తప్పుడు సర్ట్ఫికెట్లు చూపాడని ఆమె తెలిపింది.

10/07/2019 - 01:18

వికారాబాద్, అక్టోబర్ 6: వాతావరణం అనుకూలించలేదో.. సిగ్నల్స్ అందలేదో తెలియదు కానీ.. ఇద్దరు ట్రైనీ పైలట్ల ప్రాణాలు గాల్లో కలిశాయి. పంట పొలాల్లో శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండ లం సుల్తాన్‌పూర్ గ్రామ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు,

10/07/2019 - 08:26

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం రాత్రి రవిప్రకాష్‌ను చంచల్‌గూడా జైలుకు తరలించగా, ఆయన్ను ఓ సాధారణ ఖైదీలా అధికారులు సింగిల్ బ్యారక్‌లో ఉంచారు. గత రాత్రి రవిప్రకాష్ నిద్రపోలేదని తెలిసింది.

Pages