S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/10/2019 - 02:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సీబీఐ అధికారి రాకేష్ అస్థానా అవినీతి కేసులో విచారణకు ఢిల్లీ హైకోర్టు మరో రెండు నెలల గడువు మంజూరు చేసింది. అయితే, గడువు పొడిగింపు ఇదే ఆఖరిసారని.. మళ్లీ ఎలాంటి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు జస్టిస్ విభూ భక్రు తేల్చి చెప్పారు. సంస్థ అధికారి అస్థానా అవినీతి కేసు విచారణకు మరో ఆరు నెలల గడువు కావాలని సీబీఐ కోరింది.

10/10/2019 - 02:20

ఏలూరు, అక్టోబర్ 9: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండును న్యాయస్థానం బుధవారం మరో 14 రోజులు పొడిగించింది. వివిధ కేసుల కింద పోలీసులు అరెస్ టుచేయడంతో గత నెల 11 నుంచి చింతమనేని రిమాండులో ఉన్నారు. ఇందులో ఐదు కేసులకు సంబంధించిన రిమాండు బుధవారంతో ముగిసింది. మరో కేసుకు సంబంధించిన రిమాండు గురువారంతో ముగియనుంది.

10/10/2019 - 02:17

విజయవాడ (క్రైం), అక్టోబర్ 9: ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేసి ఖాతాదారులను మోసగిస్తున్న కేసులో పాత నేరస్తుడిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి ఏడు కేసుల్లో 79,050 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణానగర్‌కు చెందిన పేరేపి మధుసూదన్ అలియాస్ మధు(25) అనే పాత నేరస్తుడు సీఏ వరకు చదువుకున్నాడు.

10/10/2019 - 01:50

తాండూరు, అక్టోబర్ 9: తాండూరు పట్టణ పరిసరాలలో ప్రభుత్వ ప్రజా పంపిణీ రేషన్ బియ్యం అక్రమంగా తరలించి లక్షలు గడిస్తున్న అక్రమార్కుల గుట్టురట్టయింది.

10/10/2019 - 01:34

హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఎన్నిక స్వేచ్ఛగా జరిగేలా చూడాలని రాష్ట్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్ హైకోర్టులో బుధవారం నాడు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. మూడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని నవీన్ కుమార్ పేర్కొన్నారు.

10/10/2019 - 01:32

హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారం నాటికి వాయిదా పడింది. ఆయనను విచారణ నిమిత్తం పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పక్క రవిప్రకాష్ న్యాయవాదులు బెయిల్ కోరుతూ వేరే పిటిషన్‌ను దాఖలు చేశారు. టీవీ-9 చేసిన ఫిర్యాదులపై

10/09/2019 - 23:14

అన్నవరం, అక్టోబర్ 9: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కలకలం రేపింది.

10/09/2019 - 23:04

గచ్చిబౌలి, అక్టోబర్ 9: ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైయింది. గచ్చిబౌలి పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ పరిధికి సంబంధించిన రెండు కేసులకు సంబంధించి భార్గవ్ రామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

10/09/2019 - 22:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఓ ఐపీఎస్ అధికారిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసు, అంతర్గత విచారణ కమిటీ(ఐసీసీ)ని పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దర్యాప్తు, ఐసీసీని మరో రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం హైకోర్టుకు ఉందా? అన్నదానిపై పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

10/08/2019 - 05:18

హైదరాబాద్, అక్టోబర్ 7: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్లగణేశ్ పంపించారని ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వీ. పొట్లూరి (పీవీపీ) జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్లు 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Pages