S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/04/2019 - 02:03

జీడిమెట్ల, డిసెంబర్ 3: కొంపల్లి మున్సిపల్ పరిధిలోని బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌లో కొంపల్లి మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాపింగ్ మాల్‌లో విక్రయిస్తున్న ప్రొడక్ట్‌లను పరిశీలించారు. తనిఖీల్లో పళ్లు, టమోటాలు, ఉల్లిగడ్డలు, జీరా చిప్స్, పాపడాలు వంటి తినుబండారాలు తేదీ ముగిసి ఉన్నాయి.

12/04/2019 - 01:34

కర్నూలు, డిసెంబర్ 3: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన కర్నూలు జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్‌సింగ్ అక్రమాస్తులు రూ. 10 కోట్లు అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తహసీల్దార్ గోవింద్‌సింగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

12/03/2019 - 23:48

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడి యా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం బెయిల్ మంజూరుపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పును వెలువరించనుంది. న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. బెయిల్ కోసం చిదంబరం చేసుకున్న పిటిషన్‌ను గత నెల 15న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

12/03/2019 - 06:04

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. బాబ్రీ మసీదును కూల్చివేసిన వారికి బహుమతి ఇచ్చినట్టుగా తీర్పు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. తీర్పును పునఃసమీక్షించాలని అయోధ్య స్థల వివాదంలో అసలు కక్షిదారుడు సిద్దిఖీ చట్టబద్ధమైన వారసుడు వౌలాలా సయ్యద్ అషాద్ రషీదీ ఆరోపించారు.

12/03/2019 - 05:53

బెజ్జూరు, డిసెంబర్ 2: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపెల్లి మండలం గూడెం ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి.

12/03/2019 - 05:49

నల్లగొండ, డిసెంబర్ 2: నల్లగొండ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో దగ్ధమైంది. నార్కట్‌పల్లి-అద్దంకి మార్గంలో హైద్రాబాద్ నుండి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

12/03/2019 - 05:46

నేరేడుచర్ల, డిసెంబర్ 2: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో ప్రముఖ వ్యాపారవేత్త రాచకొండ శ్రీనివాస్‌రావు గృహంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు 423 గ్రాముల బంగారు అభరణాలు, 3 లక్షలకు పైగా నగదుతో పాటు మొత్తం సుమారు 20 లక్షల సొత్తును అపహరించుకొని పోయారు.

12/03/2019 - 02:01

గన్నవరం, డిసెంబర్ 2: గన్నవరం మండలం ముస్తాబాద్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కడుపు నొప్పి భరించలేక ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఈ సంఘటనలో చిన్న కొడుకు కొండా శంకర్ (5) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కొండా కోటేశ్వరరావు, అంకమ్మ భార్యాభర్తలు. వీరికి హేమంత్, శంకర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంకమ్మ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది.

12/03/2019 - 01:59

ఖమ్మం (క్రైం), డిసెంబర్ 2: పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణలోని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

12/03/2019 - 05:28

విజయవాడ (క్రైం) : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న దిశ అత్యాచార, హత్య ఘటన నేపథ్యంలో వెలువడిన ఈ తీర్పు చర్చనీయాంశమైంది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..

Pages