S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/02/2019 - 01:19

అనంతపురం: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం నగర శివారులోని సెంట్రల్ పార్కు సమీపంలోని మహదేవ్‌నగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

12/01/2019 - 05:54

మిర్యాలగూడ టౌన్, నవంబర్ 30: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసులో అతని భార్యను బెదిరించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.

12/01/2019 - 06:25

జిన్నారం, నవంబర్ 30: నిద్రిస్తున్న భార్యాభర్తలను అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, శివానగర్‌లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... జిన్నారం మండలం, శివానగర్ గ్రామానికి చెందిన బ్యాథోల్ సుధాకర్ (36), భార్య విజయలక్ష్మీ (28) శుక్రవారం రాత్రి నిద్రిస్తున్నారు. గుర్తుతెలియని దుండగులు వారిని కత్తితో అతి దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

12/01/2019 - 01:25

షాద్‌నగర్, నవంబర్ 30: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు షాద్‌నగర్ మెజిస్ట్రేట్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు.

11/29/2019 - 06:28

వరంగల్, నవంబర్ 28: మానవీయ విలువలు రోజురోజుకు మంట కలుస్తున్నాయి. పుట్టిన రోజు సరదాగా బయటకు వెళ్లిన 19 ఏళ్ల యువతి పాలిట ఆమె ప్రేమికుడే యముడిగా మారాడు. ప్రేమించిన యువతిని నమ్మించి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది.

11/29/2019 - 06:06

పాయకాపురం, నవంబరు 28: నగ ర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాల్ని నడుపుతు న్న వారిపై అటు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు, ఇటు నున్న గ్రామీణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను గురువారం నిర్వహించారు.

11/29/2019 - 05:45

న్యూఢిల్లీ, నవంబర్ 28: పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని ఢిల్లీలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇతని నుంచి 20 తుపాకులతో పాటు వంద బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నట్లు డీసీపీ ప్రమోద్ సింగ్ కుష్వంత్ స్పష్టం చేశారు. యువకుడిని మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ జిల్లాకు చెందిన రాజు దేశాయ్‌గా గుర్తించారు.

11/29/2019 - 01:35

గచ్చిబౌలి, నవంబర్ 28: హైటెక్ సిటీలో తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. హత్యకు మతపరమైన కారణలు లేవని, 300 గజాల స్థలం వివాదంలో కాపుకాసి హతమార్చారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావుతెలిపారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

11/29/2019 - 01:34

ఖైరతాబాద్, నవంబర్ 28: చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.

11/29/2019 - 01:34

ఖైరతాబాద్, నవంబర్ 28: రాష్ట్ర సచివాలయ ఉద్యోగినని చెప్పి పలువురిని మోసగించిన ఘరానా మోసగాడిని, అతనికి సహకరించిన మరో మహిళను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.

Pages