S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/11/2019 - 23:05

గుండాల, అక్టోబర్ 11: భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తుర్కల షాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల కారణంగా గ్రామంలోని కొర్నె సూరయ్య (70) తన భార్య మాణిక్యమ్మను (60) పదునైన కత్తితో గొంతుపై మెడ భాగంలో తలపై విచక్షణ రహితంగా నరకడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది.

10/11/2019 - 22:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరంను సోమవారం తన ముందు హాజరు పరచవలసిందిగా ఢిల్లీ కోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్టయిన చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

10/11/2019 - 22:41

కోజికొడ్, అక్టోబర్ 11: అత్యంత అమానుష రీతిలో సొంత వారిని హతమార్చిన సీరియల్ కిల్లర్ జోలి జోసెఫ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు సాక్షాల సేకరణ నిమిత్తం కోజికొడ్ జిల్లాలోని అనేక ప్రాంతాలకు శుక్రవారం తీసుకుని వెళ్ళారు. తనను చూసిన ప్రజలు అవహేళన చేసినా, దూషించినా జోలి జోసెఫ్ మాత్రం నిబ్బరాన్ని కోల్పోలేదు.

10/11/2019 - 21:27

అహ్మదాబాద్, అక్టోబర్ 11: రెండు వేర్వేరు ఘటనల్లో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం అహ్మదాబాద్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. హోం మంత్రి అమిత్ షాను ‘హంతకుడు’గా అభివర్ణించిన నేపథ్యంలో రాహుల్‌పై పరువు నష్టం కేసు దాఖలైన సంగతి తెలిసిందే.

10/11/2019 - 06:37

గుడిహత్నూర్, అక్టోబర్ 10: కర్ణాటక కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లాకు కంటైనర్‌లో భారీ మొత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న గుట్కా నిల్వలపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించి స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.23లక్షల వరకు ఉంటుందని, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రెట్టింపు స్థాయిలో ఉంటుందని పోలీసులు తెలిపారు.

10/11/2019 - 05:43

సంజామల, అక్టోబర్ 10: ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్ సింగ్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంజామల మండల పరిధిలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు రమేష్‌రెడ్డి తనకు సంబంధించిన ఆల్వకొండ గ్రామ పొలాల్లోని సర్వే నెం.1216-1 పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహశీల్దార్ గోవింద్‌సింగ్‌ను కోరారు.

10/11/2019 - 05:40

గంట్యాడ, అక్టోబర్ 10: విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనపై బాధిత బాలిక తల్లి సంతోషి సాయంత్రం గంట్యాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

10/11/2019 - 05:38

బుట్టాయగూడెం, అక్టోబర్ 10: విద్యుత్ తీగలు వ్యానుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ముంజులూరు సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలావున్నాయి...

10/11/2019 - 05:20

హైదరాబాద్, అక్టోబర్ 10: సంస్థ నిధులను అక్రమంగా వినియోగించుకున్నారనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై గురువారం నాడు నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగాయి. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌పై ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కింది కోర్టులు, పోలీసులు పట్టించుకోలేదని రవిప్రకాశ్ తరఫున న్యాయవాదులు తమ వాదనలో ఆరోపించారు.

10/11/2019 - 06:25

పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5,6వ దశల చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న కే. ఆనందం ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్‌పీ బీ.ప్రతాప్ తెలిపిన వివరాల మేరకు.. కేటీపీఎస్ 5,6వ దశల కర్మాగారంలో ఇటీవల 21 పనులకు గాను టెండర్ పెట్టారు.

Pages