క్రైమ్/లీగల్

పిటిషన్లన్నీ ఏ-4 పేపర్లపైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: సుప్రీం కోర్టులో ఇక నుంచి పిటిషన్లన్నీ ఏ-4 సైజు పేపర్లపైనే అనుమతిస్తారు. పర్యావరణ పరిరక్షణతోపాటు, దైనందిన కార్యక్రమంలో యూనిఫార్మటీ(ఏకరూపత) ఉండేందుకు వీలుగా ఏ-4 సైజు పేపర్లను వాడాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలవుతుంది. ఆ రోజు నుంచి పిటిషన్లన్నీ కచ్చితంగా ఏ-4 పేపర్లపైనే దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఏ-4 సైజు పేపరు ఇరుపక్కలా ముద్రించవచ్చు. సుప్రీం కోర్టు అంతర్గత సమాచార వ్యవహారాలన్నీ ఏ-4 సైజు షీట్లు(ఇరుపక్కల ముద్రణ) వినియోగించాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే జనవరి 14న సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఉన్నత న్యాయస్థానం అన్ని స్థాయిల్లోనూ విధిగా ఏ-4 వాడాలని అప్పుడాయని స్పష్టం చేశారు. దీనిపై తాజాగా అంటే ఈనెల 5ను సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏ-4 సైజు పేపర్‌ను పిటిషన్లుగా స్వీకరిస్తామని, పేపరు రెండు వైపులా ముద్రించుకోవచ్చని పేర్కొంటూ సుప్రీం వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఉత్తర్వులను గురువారం అప్‌లోడ్ చేశారు. సంబంధిత శాఖలన్నీ ఈ మార్పును గమనించాలని అందులో స్పష్టం చేశారు. ఏకరూపత ఉండడం కోసం అలాగే పేపరు వాడకంలో దుబారా తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఏ-4 సైజు సుపీరియర్ పేపర్ వినియోగంలోకి తెస్తున్నట్టు చెప్పారు. సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్‌గావ్‌కర్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి అడ్వొకేట్ ఆన్ రికార్డు నుంచి ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే అన్ని రకాలైన సమాచార మార్పిడి ఉంటుంది. అంతే తప్ప హార్డ్‌కాపీ (ప్రింటెడ్ కాపీ) ఇచ్చే విధానానినికి రిజిస్ట్రీ స్వస్తిచెబుతోంది. ఇంతకు ముందు ఉత్తర్వుల్లో జనవరి 26 నుంచి ఎకనామికల్ సైజు పేపర్ వాడాలని అందులో విషయం స్పష్టంగా ముద్రించేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇరువైపులా ఉండొచ్చని తెలిపారు. ఇప్పుడయితే ‘లీగల్ సైజ్) పేరర్, ఏ-4 కంటే పెద్దసైజు షీట్స్‌ను దేశంలోని అన్ని కోర్టుల్లోనూ వాడుతున్నారు. కాగా అవసరమున్నా లేకున్నా పెద్ద సైజు షీట్లు అలాగే ఒకవైపే ముద్రించి ఉండడం వల్ల పేపర్ వృధా అవుతోందని పలువురు సూచించారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల పిటిషన్లనూ ఏ-4 సైజు పేపర్‌పైనే స్వీకరిస్తామని సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్ ప్రకటించారు.