-
హైదరాబాద్, డిసెంబర్ 12: దిశ కేసులో నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అ
-
హైదరాబాద్, డిసెంబర్ 12: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం ప
-
నెల్లూరు: ‘ కాకినాడ నుండి చెన్నై వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 9న ఒక ప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సమయంలో చిదంబరంను ముఖాముఖిగా ఎదుర్కోవడానికి తిరస్కరించిన సాక్షులను చిదంబరం కాని ఆయన తరపున మరెవరయినా కాని అడ్డుకున్నట్టు కాని, బెదిరించినట్టు కాని ఆధారాలు లేవని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి అక్కడి అధికారులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణకు స్వీకరించనున్నది. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా శబరిమల ఆలయానికి వెళ్ళవచ్చన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కేరళ పోలీసులు, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బిందు అమ్మినీ అనే మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఐ పోలవరం, డిసెంబర్ 3: ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమేకాక, చీర మెడకు చుట్టి ఊపిరి ఆడకుండాచేసి హత్యచేసి, ఇంట్లో నగదు దోచుకున్న అమానుష ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం జి వేమవరం గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.
కోయిలకొండ , డిసెంబర్ 3:దేశ రాజధాని ఢిల్లీలో జీవనం కొనసాగిస్తూ సొంత గ్రామంలో అక్క వివాహానికి వచ్చి పెళ్లి జరిగిన మూడో రోజే ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు కోయిల్‌సాగర్ పెద్ద వాగులో పడి మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కోయలకొండ మండలంలో చోటు చేసుకుంది.
సూర్యాపేట, డిసెంబర్ 3: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గోదావరిఖని టౌన్, డిసెంబర్ 3: దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొని సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని అశోక్ నగర్లో నివాసముండే సల్లం సరోజ మల్లేష్ దంపతుల దత్త పుత్రిక సల్లం జ్యోతి (14) సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3: జిల్లా మైనింగ్ అసిస్టెండ్ డైరక్టర్ శ్రీనివాస్ ఓ వ్యక్తి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్, డిసెంబర్ 3: పాతబస్తీలో ఓ పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈశ్వరయ్య ఫలక్‌నుమా పోలీస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి షంషీర్గంజ్ గోశాల రోడ్డులో హల్చల్ చేశాడు. రోడ్డుపై తూలి పడిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జీడిమెట్ల, డిసెంబర్ 3: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేపాల్‌కు చెందిన ధానిరామ్ పద్మరాజ్ బండారి (30) చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. లాల్ బహదూర్ బిస్ట్ (40) సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తాడు. చంద్రకాంత్ బండారి (32) మార్కెటింగ్ వర్క్ చేస్తాడు.
ఖైరతాబాద్, డిసెంబర్ 3: బంజారాహిల్స్ రోడ్డుపై ఓ కారు దగ్ధం అయింది. మంగళవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 మీదుగా ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని గమనించేలోపే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రావణ్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి దిగి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఫైరింజన్లు వచ్చే లోపే పెద్ద ఎత్తున మంటలు కమ్ముకొని కారు పూర్తిగా దగ్ధం అయింది.