S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/18/2019 - 23:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ, కొందరు ప్రభుత్వ అధికారులు సహా మొత్తం 14 మందిపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.

10/18/2019 - 23:31

నడిగూడెం, అక్టోబర్ 18: పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల గ్రామం శివారులోని నాగార్జున సాగర్ ఎడమకాలువలోకి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో స్కార్పియో వాహనం దూసుకెళ్లి నీట మునగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు.

10/18/2019 - 23:20

కాకినాడ, అక్టోబర్ 18: తూర్పు గోదావరి జిల్లాలో మరో భారీ బాణసంచా ప్రమాదం సంభవించింది. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జి వేమవరంలోని శివపార్వతి బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగావుంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

10/18/2019 - 23:18

గుంటూరు, అక్టోబర్ 18: రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యుజే నేతలు డీజీపీ సవాంగ్‌ను కలిసి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

10/18/2019 - 23:02

హైదరాబాద్, అక్టోబర్ 18: టీవీ -9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై నమోదైన కొత్త కేసుపై అతని తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సీరియస్ అయ్యారు. ఒక మనిషిని ఎంతలా హింస పెడతారు అంటూ ప్రశ్నించారు. రవిప్రకాశ్‌ను ఎంతకాలం జైలులో ఉంచుతారని ప్రశ్నించారు.

10/18/2019 - 23:01

హైదరాబాద్, అక్టోబర్ 18: జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి , ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించలేదని ఆయన ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

10/18/2019 - 22:43

బెంగళూరు, అక్టోబర్ 18: బెంగళూరులో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని, దీనితో ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కర్నాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు, మైసూరులో ఉన్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కారణంగా, కర్నాటకతోపాటు, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతాల్లో దాడులకు జరగవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

10/18/2019 - 04:32

వరంగల్ : మావోయిస్టుల పేరుతో రియల్టర్లను, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు గల నకిలీ నక్సల్స్ ముఠాను గురువారం వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి మూడు నాటు తుపాకులు, ఒక ఎయిర్ పిస్తోల్, 60వేల నగదు, మూడు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం, ఎనిమిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి వివరించారు.

10/18/2019 - 04:26

వరదయ్యపాళెం : చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల పరిధిలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో గురువారం కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగించారు. ఈక్రమంలో ‘ఎం-బ్లాక్’లోని ఓ గదిలో ఉన్న కప్‌బోర్డులో ఒక సంచి నిండా విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉండటాన్ని గుర్తించారు. వీటి విలువ 20 నుంచి 25 కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది.

10/18/2019 - 02:14

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరంను ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 24వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ గురువారం ఆయనను తీహార్ జైలులోనుంచి తీసుకెళ్లింది.

Pages