క్రైమ్/లీగల్

అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, మార్చి 21: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో రాణా పంచాయతీ(కొత్తపేట)కు చెందిన కౌలురైతు సిహెచ్ శంకరరావు(36) శుక్రవారం రాత్రి కుటుంబంతోసహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకరరావుతోపాటు ఆయన భార్య కళావతి(30) పెద్ద కుమార్తె గీతాంజలి(10) పురుగు మందును సేవించారు. రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో బాధతో కొట్టుమిట్టాడుతున్న వారిని గమనించిన చిన్నకుమార్తె హారిక చుట్టు పక్కల వారికి తెలియజేయగా, హుటాహుటిన బాధితులను వైద్యచికిత్స కోసం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకరరావు, ఆయన భార్య కళావతి మృతి చెందగా, పెద్దకుమార్తె గీతాంజలి పరిస్థితి విషమంగా ఉంది. తర్వాత ఆమె మరణించిందని వైద్యాధికారులు శనివారం తెలియజేశారు. వారు పురుగుల మందు సేవించిన సమయంలో చిన్నకుమార్తె బయటకు వెళ్లిపోవడంతో ఆమె బ్రతికిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. వ్యవసాయ కౌలుదారు పనిచేస్తూ అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చుట్టుపక్కల వారు భావిస్తున్నారు. మృతుడుకు తల్లి దమయంతి, తమ్ముడు సతీష్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడు శంకరరావుకు 2007లో వివాహం జరిగింది. మృతుడు నాలుగు ఎకరాల్లో కౌలు చేస్తున్నాడు. మృతుడికి సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. దసరా తర్వాత పనుల కోసం వైజాగ్‌కు వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. సీఐ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.