క్రైమ్/లీగల్

చోరీ కేసులో భార్యభర్తల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, మార్చి 21: రైల్వే స్టేషన్‌లలో, నడుస్తున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన భార్యభర్తలను సికింరాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.16లక్షల 80వేల విలువైన బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్‌ఐ బీ.ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో నిందితులను పట్టుకున్నట్లు తెలంగాణ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.
జీడిమెట్ల షాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మంద కుమార్, అతని భార్య మంద గౌరీ సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలనే ప్రవృత్తిగా మార్చుకున్నారు.
సికిందరాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాలలో, రైళ్లలో ఒంటరిగా ఉన్న వారిని గుర్తించి దృష్టి మరల్చి బ్యాగ్‌లను తెరిచి, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు పది చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 42తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.