బిజినెస్

చందాకొచర్ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా తన తొలగింపును సవాలు చేస్తూ చందా కొచర్ దాఖలు చేసిన పిటిషన్‌ను బొంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రైవేటు సంస్థలో వ్యక్తిగత సర్వీసు కాంట్రాక్టు విధానంలో ఉన్న కారణంగా ఈ వివాదంలో జోక్యం చేసుకోదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్‌ఎం జాందార్, ఎంఎస్ కార్నిక్‌ల డివిజన్ బెంచ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రైవేటు సంస్థ కాంట్రాక్టు విధానంలో సర్వీసు కొనసాగినందున వివాదాస్పద కేసును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న ఐసీఐసీఐ బ్యాంకు వాదనను ధర్మాసనం అంగీకరించింది. తొలగింపు అనేది కాంట్రాక్టు ఒప్పందాల్లో భాగమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్టు పరిధిలో ఉద్యోగం ఉన్నప్పుడు కోర్టు పరిధిలోకి కేసు రాదని పేర్కొంది. ‘కాంట్రాక్టు విధులు ప్రైవేటు చట్ట ప్రకారం ఉంటాయనీ.. అందులో భాగంగా సంస్థకు జరిగే నష్టాలు, ఉద్యోగి సామర్థ్యం ధ్రువీకరించడమే అనే అంశాలన్నీ అందులోకే వస్తాయి’ అని కోర్టు పేర్కొంది. ఓ ప్రైవేటు కంపెనీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు పొందకుండా నడుస్తుంది.. అలాంటప్పుడు సంస్థ అప్పజెప్పిన పనుల్లో ఎలాంటి అవాంతరాలు, అవకతవకలు జరిగినా చర్య తీసుకొనే అధికారం ఆయా ప్రైవేటు బాడీలకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద ప్రైవేటు సంస్థలు ఆయా కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో తీసుకొనే ఎలాంటి చర్యల్లో అయినా న్యాయపరమైన జోక్యం ఉండదు అంటూ ఐసీఐసీఐ తరఫు న్యాయవాది దారియస్ కంబటా వాదించారు. దీనికి అనుగుణంగా కోర్టులు తమ తీర్పులను ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆయన తన వాదనలో స్పష్టం చేశారు. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా చందాకొచర్ కొనసాగడానికి వీలులేని సందర్భంలోనే ఆమె తొలగింపు అనివార్యమైందనీ.. ఆమె పిటిషన్ కొట్టివేయాలని బ్యాంకు హైకోర్టును కోరింది. ఆరోపణల నేపథ్యంలో చందాకొచర్ 2018 సంవత్సరం అక్టోబర్ ఐదో తేదీన ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ చేశారనీ.. ఆ తరువాత ఎప్పుడో ఆమెను చైర్మన్, ఎండీ పదవి నుంచి తొలగిస్తున్నామంటూ బ్యాంకు పేర్కొనడం సరికాదనీ.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ కొచర్ తరఫు న్యాయవాది విక్రమ్ నాంకాని అంతకుముందు కోర్టుకు వివరించారు. అలాగే, కొచర్‌కు న్యాయబద్ధంగా రావల్సిన వేతనం, బోనస్ తదితరాలను సంస్థ స్తంభింపజేసిందని వాదించారు. వాదోపవాదాల అనంతరం ఒక ప్రైవేటు సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ వారి నిబంధనలకు అనుగుణంగా నడవకుండా ఉన్నప్పడు కోర్టులు జోక్యం కలుగజేసుకోలేవని బాంబే హైకోర్టు ధర్మాసనం పేర్కొంటూ చందాకొచర్ పిటిషన్‌ను కొట్టివేసింది.

*చిత్రం... చందాకొచర్