బిజినెస్

కడపలో మరో ఉక్కు కర్మాగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 5: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ముందుకు వచ్చింది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎంఆర్ ఏజీ కంపెనీ ముందుకు వచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో ఆ కంపెనీ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. కడప జిల్లాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆ కంపెనీ ఆసక్తి చూపింది. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు 12 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం తదితర గనుల తవ్వకాలు సహా విద్యుత్, ఉక్కు కర్మాగారాలనూ నడుపుతున్నామని కంపెనీ ప్రతినిధులు వివరించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున ప్రయత్నాలు ముమ్మరం చేశామని వారికి ముఖ్యమంత్రి వివరించారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఐఎంఆర్ కూడా మరో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే అక్కడ చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. నీరు, విద్యుత్, ఇతర వౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధమని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహాదారులతో మంచి రవాణా సదుపాయం ఉందన్నారు. పరిశ్రమల రాక వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో కడప జిల్లా ప్రాంతం స్టీల్ సిటీగా రూపాంతరం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని ఐఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్, ఐఎంఆర్ ఏజీ చైర్మన్ హాన్స్ రడాల్ఫ్ వైల్డ్, డైరెక్టర్ అనిరుద్ మిశ్రా, సెడిబెంగ్ ఐరన్ ఓర్ కంపెనీ సీఈవో అనీష్ మిశ్ర, ఏపీ ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ఎండీ మధుసూదన్ పాల్గొన్నారు.
*చిత్రం... స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి