బిజినెస్

మెట్రో ప్రయాణికులకు మరొక సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, మార్చి 5: పటణ ప్రయాణికుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పేటీఎంతో కలసి క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ విధానాన్ని ప్రారంభించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. బేగంపేట్‌లోని మెట్రో భవన్‌లో పేటీఎం క్యూ ఆర్‌కోడ్ ఆధారిత మెట్రో టికెటింగ్ వ్యవస్థను ఎన్‌వీఎస్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్తులో ప్రయాణికుల సమస్యలను ఊహించి సాంకేంతిక శక్తితో పరష్కారాలను అందిస్తు హైదరాబాద్ మెట్రోరైల్ ఒక అడుగు ముందుకేసిందని అన్నారు. ఈ సరికొత్త సేవను ఉపయోగించుకోవడంతో ప్రయాణికులు మెట్రో రైళ్లలో సులభంగా ప్రయాణిస్తారని పేర్కొన్నారు. మెట్రో స్టెషన్లలో టోకెన్ల కొనుగోల్ కోసం క్యూ లైన్‌లో నిల్చోవడంతో ఎక్కువ సమయం కేటాయించకుండా సులభంగా ఈ విధానంలో టికెట్ కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్‌సీ) గేట్ల వద్ద ప్రదర్శిస్తామని వివరించారు. డిజిటల్ టికెట్‌ను సజావుగా బుక్ చేసుకోవడానికి, పరిశ్రమలో ముద్ర వేయడానికి కూడా సహాయపడుతుందని రెడ్డి తెలిపారు. ఈ విధానంతో 14లక్షల మంది స్మార్ట్ కార్డుదారులు లబ్ది పొందుతారని అన్నారు. పేటీఎం యాప్‌ను ఉపయోగించి సింగిల్, రిటర్న్, స్టోర్ విలువ, ట్రిప్ పాస్ టికెట్లను కొనుగోలు చేయడమే కాకుండా, కనెక్టివిటీని కూడా పొందవచ్చని తెలిపారు. ఈ సేవను మెట్రో ఫీడర్ బస్సులకు కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఎండీ చెప్పారు. పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ శర్మ మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులు ఎక్కువ సేపు టికెట్ల కౌంటర్ల వద్ద వేచియుండకుండా, రద్దీని తగ్గించడానికి ఎంతగానో సహకరిస్తుందని తెలపాడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణం మధ్యలో కూడా టికెట్లు కొనుగోలు చేసుకోడానికి యాప్ ఉపయోగ పడుతుందని అన్నారు.