S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/03/2020 - 05:01

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం సమాజ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనావేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘కరోనా’ వైరస్‌ను నివారించేందుకు అన్ని కోణాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ, ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

03/03/2020 - 01:19

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రఖ్యాత కొరియా మోటార్ వాహన దిగ్గజ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి భారత్‌లో 15,644 వాహనాలను విక్రయించినట్టు సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తంలో 10,024 యూనిట్ల సెల్టోస్, 1,620 యూనిట్ల కార్నివాల్ వాహనాలు ఉన్నాయని తెలిపింది. వాహనాల తయారీలో తమ సంస్థ భారత్‌లో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొంది.

03/03/2020 - 01:17

న్యూఢిల్లీ, మార్చి 2: ఎన్టీపీసీ, పీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్‌ల నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణల పేరిట తన వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలన్న ఆలోచనపై ఇంధన మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు తమ అభ్యంతరాలను తెలియజేశామని ఇంధన కార్యదర్శి ఎన్‌ఎస్ సహాయ్ సోమవారంనాడు ఇక్కడ తెలిపారు.

03/03/2020 - 01:16

ముంబయి, మార్చి 2: కరోనా వైరస్ ప్రభావం వజ్రాల వ్యాపారాన్ని కూడా కుంగదీస్తోంది. 2021 నాటికి భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 19 బిలియన్ డాలర్లకు తగ్గిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా డిమాండ్ మాంద్యమే దీనికి కారణమని తాజాగా వెలువడిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. 2018-19లో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

03/03/2020 - 01:14

ముంబయి, మార్చి 2: వరుసగా ఏడో రోజు కూడా కరోనా వైరస్ భారత స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. తాజాగా మరో రెండు కేసులు బయటపడిన నేపథ్యంలో చివరి గంట లావాదేవీల్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. ఫలితంగా 153 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ 38,144.02 వద్ద ముగిసింది. సోమవారం ఆశాజనకంగా మొదలైన లావాదేవీలు చివరి గంటలోనే నష్టాలకు దారితీశాయి. ఆర్థిక, ఉక్కు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

03/02/2020 - 05:30

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టడానికి పూనుకుంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు బరువు కలిగిన ఒక యుద్ధ హెలికాప్టర్‌ను 2027 నాటికి తయారు చేయడానికి గ్రౌండ్‌వర్క్‌ను ప్రారంభించింది.

03/02/2020 - 05:03

విశాఖపట్నం, మార్చి 1: అత్యధికంగా సరకు లోడింగ్ సాధించిన ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేర్ డివిజన్ తొలిసారిగా రికార్డుకెక్కింది. ఒకేరోజు ఏకంగా 72 గూడ్స్ రైళ్ల ద్వారా అత్యధిక లోడింగ్‌ను సాధించింది. భారతీయ రైల్వేలోనే మరే జోన్‌లో లేనివిధంగా వాల్తేర్ డివిజన్ పరిధిలోనే ఫిబ్రవరి 29వతేదీ ఒక్కరోజులోనే 72గూడ్స్ రైళ్లు (రేక్స్) 3782వ్యాగన్ల ద్వారా సరకు లోడింగ్‌ను నిర్వహించింది.

03/02/2020 - 05:05

విజయవాడ, మార్చి 1: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పటికే దాదాపు 5వేల కోట్ల రూపాయల మేర పీకల్లోతు నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీపై అదనపు భారం పడింది. ఇటీవలే నామమాత్రంగా టిక్కెట్ చార్జీ పెంచినప్పటికీ పెరిగే వడ్డీల భారంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.07 పైసలు వ్యాట్ చార్జీ పెంచింది.

03/02/2020 - 02:16

కరీంనగర్, మార్చి 1: కరోనా ఎఫెక్ట్ యావత్ ప్రపంచంతో పాటు కరీంనగర్‌పై పడింది. కరోనా దెబ్బకు ఆర్థికవ్యవస్థ అతలాకుతలమవుతోంది. కరీంనగర్‌కు రావాల్సిన 120 కోట్ల లావాదేవీలు కరోనా ప్రభావంతో నిలిచిపోయాయి. ప్రతి నెలా చైనాకు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్‌లను కరీంనగర్ నుంచే ఎగుమతి చేసే వ్యాపారులు ఈ వైరస్ ప్రభావంతో వ్యాపారం ఆగిందని ఆందోళన పడుతున్నారు.

03/02/2020 - 01:26

ముంబయి, మార్చి 1: భారత షేర్ మార్కెట్ల పయనం ఎటు? అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. మార్కెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. గత వారం ఎదురైన భారీ నష్టాల నుంచి మార్కెట్లు ఎంత వరకూ కోలుకుంటాయన్నది ప్రశ్న. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ గత వారం ఏకంగా 2,872.83 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే.

Pages