S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/10/2020 - 05:16

ముంబయి: కరోనా వైరస్ ప్రకంపనలు అంతర్జాతీయ మార్కెట్లతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్లను కకావికలం చేస్తున్నాయి. ఈ వైరస్ తీవ్రత పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి తలెత్తపడంతో ఒక్కసారిగా సోమవారం ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీలు అనూహ్యరీతిలో కుంగిపోయాయి. ఇటీవల కా లంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో సెనె్సక్స్ భారీగా పతనమైంది.

03/10/2020 - 04:51

అమరావతి, మార్చి 9: రాష్ట్రంలో పెట్టుబడులకు ఇండో జర్మన్ బిజినెస్ కౌన్లిల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో జర్మన్ కాన్సుల్ జనరల్ కెరిన్ క్రిస్టినా మరియా స్టోల్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారని ఈ సందర్భంగా సీఎం జగన్‌ను కెరిన్ అభినందించారు.

03/10/2020 - 04:29

న్యూఢిల్లీ, మార్చి 9: కరోనా వైరస్ ప్రభావం యావత్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఒకటైనా కతర్ అయితే.. భారత్ సహా 13 దేశాల ప్రజలు తమ దేశానికి రావద్దని ఆంక్షలు జారీ చేసింది. ఇది కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తాత్కాలిక చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు కతర్ ఒక ప్రకటనలో పేర్కొంది.

03/10/2020 - 03:44

విజయవాడ, మార్చి 9: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోతాయంటూ ఉదయం నుంచే ఒక్కసారిగా ప్రచారం గుప్పుమంది. దీనికితోడు కొందరు మంత్రులు ఈ ప్రచారం కరెక్టేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బార్ అండ్ రెస్టారెంట్ల వరకు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. బ్లాక్ టిక్కెట్ల అమ్మకందారులు సైతం మద్యం కోసం క్యూకట్టారు.

03/10/2020 - 00:59

ఆర్థిక మాంద్యం భయం స్టాక్ మార్కెట్లను కుంగదీసింది. సెనె్సక్స్ 1941 పాయింట్లు, నిఫ్టీ 538 పాయింట్లు గత 13 నెలల్లో ఎన్నడూ లేని రీతిలో పతనమయ్యాయి. ఫలితంగా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి
అయిపోయింది. కరోనా వైరస్ భయంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని
మార్కెట్లు పతనమయ్యాయి.

03/09/2020 - 23:52

న్యూఢిల్లీ, మార్చి 9: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడంతో దేశంలో పెట్రోలు ధర కూడా 71 రూపాయల దిగువకు చేరుకుంది. ఈ అంతర్జాతీయ పరిణామాల నుంచి గరిష్ట స్ధాయిలో లబ్ధిని చేకూర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా చమురు ఉత్పత్తి దేశాల మధ్య జరుగుతున్న ఈ ధరల యుద్ధంలో పూర్తిస్థాయిలో లాభం పొందాలన్న లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోంది.

03/09/2020 - 23:51

న్యూఢిల్లీ, మార్చి 9: ఎస్ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ సోమవారం విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ సంస్థ, ఎస్ బ్యాంక్ సహ సంస్థాపకుడు కుటుంబానికి 600 కోట్ల రూపాయల మేర ముడుపులు చెల్లించారన్న ఆరోపణలపై సీబీఐ ఈ తనిఖీలు జరిపింది. మొత్తం ఏడు చోట్ల అధికారులు సోదాలు జరిపారు.

03/09/2020 - 05:41

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ‘నారీ శక్తి పురస్కార్ 2019’ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి స్వీకరిస్తున్న బీనా దేవి. రాష్ట్రపతి భార్య సవితా కోవింద్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ తదితరులు కూడా ఉన్నారు. జార్ఖండ్‌కు చెందిన బీనాను అభిమానులు ‘మష్రూమ్ మహిళ’ అని పిలుస్తారు.

03/09/2020 - 05:17

న్యూఢిల్లీ, మార్చి 8: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత వారం అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణును ప్రదర్శించడంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. ఫలితంగా దేశంలోని పది అత్యంత విలువైన కంపెనీల్లో ఆరు కంపెనీల విలువ భారీగా పతనమైంది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 720.67 పాయిం ట్లు (1.88 శాతం) పడిపోయిన విషయం తెలిసిందే.

03/09/2020 - 05:06

న్యూఢిల్లీ, మార్చి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌సెల్‌ను దివాళా ప్రక్రియ నుంచి తప్పించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టెలికం శాఖ వేసిన అప్పీల్‌ను నేషనల్ కంపెనీ లా అపిలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఏఎల్‌టీ) కొట్టివేసింది.

Pages