బిజినెస్

భారీ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత వారం అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణును ప్రదర్శించడంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. ఫలితంగా దేశంలోని పది అత్యంత విలువైన కంపెనీల్లో ఆరు కంపెనీల విలువ భారీగా పతనమైంది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 720.67 పాయిం ట్లు (1.88 శాతం) పడిపోయిన విషయం తెలిసిందే. దీనితో ఆరు ప్రధాన కంపెనీల మార్కెట్ విలువ 95,432.26 కోట్ల రూపాయలు తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దారుణంగా నష్టపోయాయి. ఎస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. రిల్ మార్కెట్ విలువ రూ.37,144 కోట్లు తగ్గడంతో రూ.8,05,118.67 కోట్లక్లు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.23,435 కోట్లు పతనమై, రూ. 6,22,109.94 కోట్లుగా స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్ రూ.14,229.10 కోట్ల నష్టంతో రూ.2,54,309.90 కోట్లకు పడింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ 11,625.30 కోట్లు పతనమై, 3,65,214.59 కోట్ల రూపాయలకు, ఐసీఐసీఐ బ్యాంక్ విలువ 6,325.67 కోట్లు పతనమై, 3,14,705.23 కోట్ల రూపాయలకు చేరాయి. అదే విధంగా భారతి ఎయిర్‌టెల్ విలువ 2,673.22 కోట్లు తగ్గి, రూ.2,83,225.26 కోట్లుగా నమోదైంది. ఇలావుంటే, ప్రతికూల వాతావరణంలోనూ టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) మార్కెట్ విలువ అత్యధికంగా రూ.43,884.14 కోట్లు లాభపడి, రూ.7,94,717.56 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువకు 3,364.34 కోట్ల రూపాయలు జత కలవడంతో 3,14,821.60 కోట్ల రూపాయలకు ఎదిగింది. హిందుస్థాన్ యూనీలెవర్ (హెచ్‌యూఎల్) విలువ 2,534.80 కోట్ల రూపాయలు పెరిగి, 4,73,359.77 కోట్ల రూపాయలకు చేరింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ మార్కెట్ విలువ 2,447.70 కోట్ల పెరుగుదలతో 3,12,168.86 కోట్ల రూపాయలకు చేరింది. ఇలావుంటే, దేశంలోని పది అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిల్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ, నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నది. ఆతర్వాతి స్థానాల్లో వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి.