బిజినెస్

కరోనా ప్రభావంతో కతర్‌కు ‘నో ఎంట్రీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: కరోనా వైరస్ ప్రభావం యావత్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఒకటైనా కతర్ అయితే.. భారత్ సహా 13 దేశాల ప్రజలు తమ దేశానికి రావద్దని ఆంక్షలు జారీ చేసింది. ఇది కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తాత్కాలిక చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు కతర్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్ సహా బంగ్లాదేశ్, చైనా, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్‌లాండ్‌ల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని కరాఖండీగా తేల్చి చెప్పింది. వీసాలు ఉన్నా.. ఇక్కడ నివాసం ఉండే వారైనా.. వర్క్ పర్మిట్ ఉన్నా.. తాత్కాలిక విజిటర్లయినా సరే కతర్‌కు రావద్దని స్పష్టంగా తన వైఖరిని తెలియజేసింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలిన ఇటలీకి అయితే.. పూర్తిగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కతర్ ఎయిర్‌వేస్ స్పష్టం చేసింది. నేరుగా దోహాకు వచ్చే వారైతే కచ్చితంగా వారి వారి ప్రయాణాలను తాత్కాలికంగా రద్దుచేసుకోవాలని ఆదేశించింది. అయితే, దోహా మీదుగా ఇతర దేశాలకు వెళ్లేవారు ఎవరైనా ఉంటే కనుక సదరు విమానం నుంచి కాలు కింద పెట్టకుండా నేరుగా కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కవచ్చని మాత్రం స్పష్టం చేసింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి 103 వీక్లీ సర్వీసులను దోహాకు నిర్వహిస్తోంది. తాత్కాలికంగా మాత్రమే వీటిని రద్దు చేస్తున్నట్లు కతర్ ఎయిర్‌వేస్ పేర్కొంది. ఇప్పటికే ముందుస్తుగా బుక్ చేసుకొన్న విమాన ప్రయాణికుల ప్రత్యామ్నాయ ప్రయాణానికి అవసరమైన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌పై జాతీయ, అంతర్జాతీయంగా వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా సర్వీసులను నిర్వహించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, మార్చి 17వరకు కతర్‌కు తన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే, గో ఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కరోనా భయంతో గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయనున్నామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారి ఒకరు వెల్లడించారు. కువైట్ ఎయిర్‌వేస్ గత వారమే భారత్ నుంచి వచ్చే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.