బిజినెస్

టెలికం అప్పీల్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌సెల్‌ను దివాళా ప్రక్రియ నుంచి తప్పించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టెలికం శాఖ వేసిన అప్పీల్‌ను నేషనల్ కంపెనీ లా అపిలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఏఎల్‌టీ) కొట్టివేసింది. పిటిషన్‌ను దాఖలు చేయడంలో టెలికం శాఖ తీవ్ర జాప్యం చేసిందని, కాబట్టి ఈ అప్పీల్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. దివాళా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, ఒక కంపెనీ లేదా సంస్థకు విరామం ఇవ్వడాన్ని టెలికం సవాలు చేసింది. అసలు ఇది చట్ట సమ్మతమేనా? అని ప్రశ్నించింది. స్పెక్ట్రమ్ లైసెన్స్ నియమనిబంధనలను అనుసరించి, బకాయిలు పడిన ఎయిర్‌సెల్‌పై టెలికం సంస్థకు పూర్తి అధికారం ఉంటుందని ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్‌సీఎల్‌టీ ముంబయి శాఖ స్పష్టం చేసింది. అయితే, మారటోరియం విధించిన నేపథ్యంలో, ఈ సంస్థ విషయంలో ఏ అధికార యంత్రాం జోక్యం చేసుకోకూడదని పేర్కొంది. కాగా, ఈ తీర్పును టెలికం సంస్థ ఎన్‌సీఏఎల్‌టీలో సవాలు చేసింది. దివాళా ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు, ఒక కంపెనీకి ప్రకటించిన మారటోరియం వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను కొట్టివేయాల్సిందిగా ఎన్‌సీఏఎల్‌టీని అభ్యర్థించింది. అయితే, పిటిషన్‌ను దాఖలు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఎన్‌సీఏఎల్‌టీ పేర్కొంది. దివాళా ప్రక్రియ నిబంధన 2016 ప్రకారం, ఎన్‌సీఎల్‌టీ తీర్పును లేదా ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా పిటిషన్ వేయాల్సి ఉంటుందని ఎన్‌సీఏఎల్‌టీ పేర్కొంది. ఏవైనా ప్రత్యేకమైన లేదా అనివార్య కారణాలు ఉంటే, ఈ కాలాన్ని మరో 15 రోజులు పొడిగించే అవకాశం ఉంటుందని తెలిదింది. అయితే, ఎన్‌సీఎల్‌టీ 2019 డిసెంబర్ 20న తీర్పును వెల్లడిస్తే, టెలికం దానిని సవాలు చేస్తూ 2020 ఫిబ్రవరి 20వ తేదీన పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావించింది. అంటే, 61 రోజుల తర్వాత టెలికం పిటిషన్ దాఖలైందని, అందుకే, దీనిని కొట్టివేస్తున్నామని వివరించింది.