బిజినెస్

‘నారీ శక్తి పురస్కార్ 2019’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ‘నారీ శక్తి పురస్కార్ 2019’ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి స్వీకరిస్తున్న బీనా దేవి. రాష్ట్రపతి భార్య సవితా కోవింద్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ తదితరులు కూడా ఉన్నారు. జార్ఖండ్‌కు చెందిన బీనాను అభిమానులు ‘మష్రూమ్ మహిళ’ అని పిలుస్తారు. సంప్రదాయ ఎరువులతో మష్రూమ్స్ ఉత్పత్తిలో పేరు సంపాదించడమేగాక, ఎంతో మంది మహిళలకు ఆమె మార్గదర్శకంగా నిలిచారు. మష్రూమ్స్ సేద్యం లాభదాయకమని నిరూపించారు. గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. మహిళా సాధికారికత కోసం చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్రం ఆమెను ‘నారీ శక్తి పురస్కార్ 2019’ అవార్డుతో సత్కరించింది.