S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/06/2020 - 23:52

న్యూఢిల్లీ, జనవరి 6: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ఫలితంగా చమరు రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. భారత్‌లో సోమవారం నుంచి పెట్రోలు రేటును లీటరుకు 15 పైసలు చొప్పున, డీజిల్ లీటరు 17 పైసలు చొప్పున కంపెనీలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారల్‌కు 70 డాలర్లు చేరుకోవడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది. ఢిల్లీలో పెట్రోలు లీటరు తాజా రేటు ప్రకారం 75.69 పైసలు.

01/06/2020 - 23:51

న్యూఢిల్లీ, జనవరి 6: మార్కెట్ల ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సురక్షిత పెట్టుబడులపైనే మదుపుదారులు దృష్టి పెట్టడంతో బంగారం పంట పండింది. దేశ రాజధానిలో సోమవారం 10 గ్రాములకు ఏకంగా 720 రూపాయల మేర బంగారం రేటు పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 41,730 రూపాయలకు చేరుకుంది. వెండి కొనుగోళ్లపై కూడా మదుపుదారులు దృష్టి పెట్టడంతో దీనిపై రేటు కూడా కిలోకు 1,100 రూపాయల చొప్పున పెరిగింది.

01/06/2020 - 23:49

న్యూఢిల్లీ, జనవరి 6: మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా వరుసగా రెండు సెషన్లలో భారతీయ మార్కెట్లు భారీగా నష్టపోవడం వల్ల దాదాపు 3.36 లక్షల కోట్ల రూపాయల మేర ఇనె్వస్టర్ల సంపద హరించుకుపోయింది. వరుసగా రెండో సెషన్‌లో కూడా ఈక్విటీ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బీఎస్‌ఈ దాదాపు 800 పాయింట్లు నష్టపోవడం వల్ల ఇక్కడ లిస్టయిన కంపెనీల ఉమ్మడి సంపద 3 లక్షల 36 వేల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది.

01/06/2020 - 06:01

న్యూఢిల్లీ: ఏడాదికి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువు విద్యుత్ బిల్లు చెల్లించేవారు, ఇళ్లకు యజమానులు ఆదాయ పన్ను శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగమైన ఐటీఆర్-1 రిటర్న్‌ను దాఖలు చేయడానికి అనర్హులు. విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిన వారిని కూడా ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్-1కు అనర్హులుగా స్పష్టం చేసింది.

01/06/2020 - 02:23

విజయవాడ పశ్చిమ, జనవరి 5: బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరల ఘాటు రానురానూ తగ్గుతోంది. గత నెలారంభంలో కిలో రూ.180 దాకా అమ్మిన ఉల్లిపాయలు క్రమేణా ధర తగ్గుతూ నేటికి కిలో రూ.60కి చేరింది. ఉల్లిపాయల ధరలను నియంత్రించలేని ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ధరకు రైతుబజారుల ద్వారా కిలో రూ.25లకు అందించడంతో పేద, బడుగు వర్గాల ప్రజలే కాదు ధనికులు సైతం రైతుబజార్ల వద్ద క్యూలైన్‌లో బారులుతీరిన విషయం విదితమే.

01/06/2020 - 01:37

న్యూఢిల్లీ, జనవరి 5: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)కి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఒడిసాలో ఈ సంస్థకు ఇచ్చిన 4000 మెగావాట్స్ సామర్థ్యంగల బొగ్గు గని లీజ్‌ను నిలిపివేసింది. అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కోల్ మైన్స్ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

01/06/2020 - 01:35

ముంబయి, జనవరి 5: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్)పై ఒత్తిడి మరింతగా పెరుగుతున్నది. తమతమ క్లెయిమ్స్‌ను వెంటనే చెల్లించాలని ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులు పట్టుబడుతున్నారు. యూపీ పవర్ కార్పోరేషన్ (యూపీపీసీ)కు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఈ కంపెనీలో ఫిక్స్ డిపాజిట్స్ ఉంచారు.

01/06/2020 - 01:33

న్యూఢిల్లీ, జనవరి 5: గత వారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసిన కారణంగా, ‘టాప్-10’ జాబితాలో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ పతనమైంది. ఐసీఐసీఐ అత్యధికంగా నష్టపోగా, ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా 26,624.10 కోట్ల రూపాయల మేరకు తగ్గింది.

01/06/2020 - 01:31

సీలేరు, జనవరి 5: విశాఖ ఏజెన్సీ ప్రాం తంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో మేలురకమైన పసుపు పంట సాగు ప్రాజెక్టు చేపట్టనున్నారు. పసుపు సా గు ప్రాజెక్టుకు ఈ మేరకు నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఐటీడీఏఎ పీవో బాలాజీ తెలిపారు.

01/06/2020 - 01:31

న్యూఢిల్లీ జనవరి 5: వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయ ని కేంద్రం ప్రకటించింది. మిగతా రాష్ట్రాలు ఇంకా ఎలాంటి నిర్ధిష్టమైన ప్రణాళికను సమర్పించలేదని తెలిపింది.

Pages