S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/18/2020 - 23:18

ముంబయి, మార్చి 18: కరోనా వైరస్ భయం నుంచి ప్రపంచ మార్కెట్లు ఇంకా బయటపడలేదు. మదుపరులు ముందుజాగ్రత్త చర్య లు తీసుకుంటున్న కారణంగా స్టాక్ మార్కెట్లకు భారీ నష్టా లు తప్పడం లేదు. అంతర్జాతీయ సూచీలు కూడా నిరాశాజనకంగా ఉండడంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఆటుపోట్లకు గురయ్యాయి.

03/18/2020 - 23:16

న్యూఢిల్లీ, మార్చి 18: రక్షిత ముసుగులు, చేతి తొడుగులు, చేతుల శానిటైజర్ల తయారీదారులు, దిగుమతిదారులు తమ వద్ద ఉన్న నిల్వల గురించి సాయంత్రం 6గంటలలోగా సమాచారాన్ని అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ ఔషధ ధరల అథారిటీ (ఎన్‌పీపీఏ) హెచ్చరించింది.

03/18/2020 - 23:15

ముంబయి, మార్చి 18: మూలధన మార్కెట్ నుంచి డబ్బును సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ కాని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడంతో, వారి నిధుల అవసరాలు తీర్చడానికి బ్యాంకులపై ఎక్కువ ఆధారపడుతున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రుణాలు ఇవ్వడం ద్వారా ఏడాదికి పైగా 34.7 శాతం పెరిగిందని ఒక నివేదిక తెలిపింది.

03/18/2020 - 23:14

న్యూఢిల్లీ, మార్చి 18: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. అగ్రదేశాలనే గడగడలాడించిన మహమ్మారి వైరస్ దేశంపై తన పంజా విసరకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని 51 మంది పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో కోరారు.

03/18/2020 - 23:13

న్యూఢిల్లీ, మార్చి 18: వివిధ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బుధవారం స్టాక్ మార్కెట్లలో బ్యాంక్‌ల షేర్లే ఎక్కువగా పతనమయ్యాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ వాటాలు ఏకంగా 23.90 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి.

03/18/2020 - 13:51

ముంబయి: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లను కూడా కరోనా వరస్ భయం వెంటాడుతున్నది. ఫలితంగా నష్టాలు తప్పలేదు. తీవ్రమైన అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ బుధవారం 1300 పాయింట్లు పతనమై 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 328 పాయింట్లు కోల్పోయి 9000 పాయింట్ల దిగువన 8638 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

03/18/2020 - 06:33

న్యూఢిల్లీలో టయోటా కిర్లోస్కర్ మంగళవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఇన్నోవా క్రిస్టా కారు. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైన ఈ కారు ఖరీదు 21.21 లక్షల రూపాయలు. 15 ఏళ్ల క్రితం టయోటా నుంచి వచ్చిన ఇన్నోవా క్రిస్టాకు మార్కెట్‌లో విశేష ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, వివిధ వర్గాల వారికి అందుబాటులో ఉండేలా సరికొత్త మోడల్స్‌తో ఇన్నోవా క్రిస్టాను ఆ కంపెనీ విడుదల చేస్తున్నది.

03/18/2020 - 06:30

హైదరాబాద్, మార్చి 17: దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల విధానం, ఐటీ, డేటా అనలిటిక్స్ వల్ల సానుకూల వృద్ధిరేటును సాధించింది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 2029-20లో ఫిబ్రశరి వరకు 42,600 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలలో వచ్చే ఆదాయం ద్వారా నిర్దేశించినలక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది.

03/18/2020 - 07:00

న్యూఢిల్లీ: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దేశంలోని 250 రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను అమాంతం పెంచారు.

03/17/2020 - 23:52

న్యూఢిల్లీ, మార్చి 17: బీటీ కాటన్ బొల్‌గార్డ్-2 విత్తనాలపై విలు ఆధారిత, రికరింగ్ రాయల్టీ (ట్రెయిట్ విలువ)పై చార్జిలను ఎత్తివేసే విషయాన్ని కేంద్రం ఆలోచిస్తున్నది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. 2015 నుంచి బీటీ కాటన్ అమ్మకాలపై గరిష్ట ధరను ప్రభుత్వమే నిర్ధారిస్తున్నది. వాణిజ్య లాభాలు, ఇతరత్రా అంశాలపైన కూడా కేంద్రమే మార్గనిర్దేశకాలను సిద్ధం చేస్తున్నది.

Pages