బిజినెస్

రూ.82,300 కోట్లు ‘ఎగ్గొట్టే’ యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్), టాటా గ్రూప్‌లు టెలికం డిపార్ట్‌మెంట్‌కు చెల్లించవలసి ఉన్న బకాయిలను తమకు తాముగా మదింపు చేసుకునే (సెల్ఫ్ అసెస్‌మెంట్) పేరిట భారీగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత టెలికం శాఖ గణించిన బకాయిల మొత్తంతో పోలిస్తే ఈ మూడు సంస్థలు తమకు తాముగా మదింపు చేసుకున్న బకాయిల మొత్తం రూ. 82,300 కోట్లు తక్కువగా ఉంది. టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉన్న బకాయిలను సెల్ఫ్ అసెస్‌మెంట్ కసరత్తు పేరిట తిరిగి సవరించడానికి ప్రయత్నించడంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (డీఓటీ) ఈ మూడు టెలికం కంపెనీలు తనకు చెల్లించవలసి ఉన్న బకాయిల మొత్తం రూ. 1.19 లక్షల కోట్లని స్వయంగా అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. అయితే, ఈ బకాయిల చెల్లింపు కాలపరిమితి విషయంలో టెలికం కంపెనీలకు ఉపశమనం కలిగించవలసిందిగా డీఓటీ సుప్రీంకోర్టును కోరింది. డీఓటీ అంచనా ప్రకారం 2019 అక్టోబర్ నాటికి భారతి ఎయిర్‌టెల్, టెలినార్ కలిసి రూ. 43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా కంపెనీల గ్రూపు రూ. 16,798 కోట్లు చెల్లించవలసి ఉంది. అయితే, ఈ మూడు టెలికం కంపెనీలు తమకు తాముగా మదింపు చేసుకున్న బకాయిల మొత్తానికి, దీనికి మధ్య భారీగా వ్యత్యాసం ఉంది. భారతి గ్రూప్ తాను చెల్లించవలసి ఉన్న బకాయిలను రూ. 13,004 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా రూ. 21,533 కోట్లుగా, టాటా కంపెనీల గ్రూపు రూ. 2,197 కోట్లుగా తమకు తాముగా అంచనా వేసుకున్నాయి. 16 టెలికం కంపెనీలు కలిసి చెల్లించవలసిన బకాయిల మొత్తాన్ని డీఓటీ 1.69 లక్షల కోట్లుగా గణించింది. అయితే, ఈ 16 టెలికం కంపెనీలు తమ సెల్ఫ్ అసెస్‌మెంట్‌లో ఈ మొత్తాన్ని నామమాత్రంగా రూ. 37,176 కోట్లుగా గణించాయి. సుప్రీంకోర్టు గత సంవత్సరం అక్టోబర్‌లో తీర్పు ఇచ్చిన తరువాత టెలికం కంపెనీలు సెల్ఫ్ అసెస్‌మెంట్ బకాయిలను తెరమీదికి తెచ్చాయి. టెలికం కంపెనీల వార్షిక ఏజీఆర్‌ను లెక్కగట్టడంలో ఆ కంపెనీల నాన్-కోర్ బిజినెస్ నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలపాలనే ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తన తీర్పులో సమర్ధించింది. ఈ వార్షిక ఏజీఆర్‌లో కొంత వాటాను టెలికం కంపెనీలు లైసెన్స్, స్పెక్ట్రమ్ రుసుముగా ప్రభుత్వ ఖజానాకు చెల్లించవలసి ఉంటుంది.