S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/08/2020 - 23:18

రాజమహేంద్రవరం, జనవరి 8: ఇటు కృష్ణాజిల్లా గన్నవరం, అటు విశాఖకు మధ్యలో ఉన్న రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సర్వీసులతో హై ఎయిర్‌వేగా అభివృద్ధి చెందుతోంది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు గన్నవరమైనా, విశాఖ అయినా 200 కిలోమీటర్ల దూరం వల్ల రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రాధాన్యత పెరిగింది.

01/08/2020 - 23:15

న్యూఢిల్లీ, జనవరి 8: నార్త్‌ఈస్ట్ గ్యాస్ గ్రిడ్‌కు 5,559 కోట్ల రూపాయల ఫండింగ్‌ను కేంద్రం మంజూరు చేసింది. బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక గ్రిడ్‌కు లేదా గ్యాస్ పైపులైన్‌కు సహజంగా ఆర్థిక సాయా న్ని అందించదు. అయితే, కేవలం నార్త్‌ఈస్ట్ గ్రిడ్‌కు మాత్రమే ప్రత్యక్షంగా ఫండింగ్ ఇస్తోంది.

01/08/2020 - 04:14

ముంబయి: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల క్రమంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వైరం కొంత ఉపశమించిన దాఖలాలు కనిపించడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 192.84 పాయింట్లు (0.47 శాతం) లాభపడి 40,869.47 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

01/08/2020 - 03:44

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఉల్లిపాయల విక్రయం చేపట్టారు. ఉల్లిపాయలు కావాలంటూ మొదట గగ్గోలు పెట్టిన రాష్ట్రాలు ప్రజల నుండి డిమాండ్ తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనితో ముంబయి ఓడరేవుకు వచ్చిన విదేశీ ఉల్లిపాయలు కుళ్లియే ప్రమాదం ఏర్పడింది.

01/08/2020 - 02:21

వరంగల్, జనవరి 7: హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా గుర్తింపు ఉన్న వరంగల్‌లో ఐటీ విస్తరణకు బీజం పడిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ నగర శివారులోని మడికొండ ఐటీ సెజ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా ఐటీ ఇంక్యూబేటర్‌ను, సైయింటు ఐటీ సెజ్ శిలాఫలకం, భవనాన్ని ఆయన ప్రారంభించారు.

01/08/2020 - 02:14

కడప, జనవరి 7: కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి మంజూరు చేయించుకోవాల్సి వుంది.

01/08/2020 - 01:50

హైదరాబాద్, జనవరి 7: ప్రజా రవాణాలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే సంస్థ ఆర్థికంగా బలపడేందుకు పలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

01/07/2020 - 23:18

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వచ్చే మార్చి నెలలో సరళతర వాణిజ్యంపై ప్రత్యేకంగా రెండో సూచీని ఏర్పాటు చేయనుంది. సరళతర వాణిజ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును ఈ సూచీ అంచనా వేసి ర్యాంకింగ్ ఇస్తుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.

01/07/2020 - 23:16

న్యూఢిల్లీ, జనవరి 7: పది జాతీయ కార్మిక సంఘాలు సంయుక్తంగా బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో లావాదేవీలకు ఆటంకం కలుగనుంది. ఇప్పటికే మెజారిటీ శాతం బ్యాంకులు ఈ సమ్మె విషయాన్ని స్టాక్ ఎక్చేంజీలకు తెలియజేయడం జరిగింది.

01/07/2020 - 05:17

ముంబయి: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ ఏకంగా 788 పాయింట్లు పడిపోవడంతో ఇనె్వస్టర్లు కకావికలయ్యారు. లావాదేవీలు ముగిసేనాటికి గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా 787.98 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 40,676.63 వద్ద ముగిసింది.

Pages