S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/09/2019 - 23:31

చిక్మగళూరు (కర్నాటక)లో రైతులు రోడ్డుపై పారేసిన టమాటోలను తింటున్న పశువులు. భారీ వర్షాల కారణంగా టమాట పంటలు ధ్వంసం కావడంతో ఉత్పత్తులను రైతులు రోడ్లపై పారేశారు.

10/09/2019 - 23:29

ముంబయి, అక్టోబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇప్పటి వరకు వరుస నష్టాలతో మదుపరులను కలవరపరచిన మార్కెట్లు మంగళవా రం విజయదశమి సెలవుదినానంతరం లాభాల్లోకి రావడం శుభ సూచికం. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, లో హ స్టాక్స్ భారీగా లాభాలను సంతరించుకున్నాయి. తొలు త ఆచితూచి వ్యవహరించిన మదుపర్లు మధ్యాహ్నం తర్వా త భారీగా వాటాల కొనుగోళ్లకు దిగారు.

10/09/2019 - 23:28

న్యూఢిల్లీ/జనీవా, అక్టోబర్ 9: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థికంగా బలపడి పోటీలో దూసుకువెళుతుంటే మనదేశం మాత్రం ఈ పోటీలో వెనుకబడిపోతోంది. ఆర్థికాభివృద్ధి పోటీలో ఈ ఏడాది ర్యాకింగ్స్‌లో 10 స్థానాలు కోల్పోయిన భారత్ 68వ స్థానానికి పడిపోయింది. ఈ విషయంలో సింగపూర్ వేగంగా ముందుకెళుతోంది.

10/09/2019 - 23:27

ముంబయి, అక్టోబర్ 9: ముంబయి విమానాశ్రయంలో దుకాణాలకు సుంకాల రాయితీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దుకాణాలకు జీఎస్‌టీ ఇన్‌పుట్ పన్ను రీఫండింగ్‌ను నిరాకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్ను విభాగం జారీ చేసిన ఆదేశాలను బుధవారం ముంబయి హైకోర్టు కొట్టి వేసిం ది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను తిరిగి పొందేందుకు ఆ దుకాణాలకు అర్హత ఉందని కోర్టు స్పష్టం చేసింది.

10/09/2019 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వివిధ సంస్థల నుంచి 300 బస్సుల సరఫరా కోసం ఆర్డర్లు అందుకున్న జేబీఎస్ ఆటో సంస్థ వాటాలు బుధవారం 20 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఈ సంస్థకు చెందిన ఒక్కో వాటా రూ. 224.55 వంతున ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 19.98 శాతం వృద్ధితో రూ. 225.15 వంతున ట్రేడయ్యాయి.

10/08/2019 - 06:26

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం నష్టాల పాలయ్యాయి. రోజంతా ఒడిదుడుకుల పాలైన సూచీలు ఆఖరి గంటలో నెలకొన్న అమ్మకాల వత్తిడితో డీలాపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, పార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు నష్టాల్లోకి జారాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 141.33 పాయింట్లు కోల్పోయి 0.38 శాతం నష్టాలతో 37,531.98 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది.

10/08/2019 - 00:01

ముంబయి, అక్టోబర్ 7: గత పాతిక సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో ఈ సారి ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

10/08/2019 - 00:01

ముంబయి, అక్టోబర్ 7: బ్యాంకుల్లో డిపాజిటర్ల బీమా కవరేజీ పరిమితిని ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయలను మరింతగా పెంచాల్సిన తక్షణావసరం ఏర్పడిందని సోమవారం నాడిక్కడ విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయన నివేదిక సూచించింది.

10/07/2019 - 23:43

న్యూఢిల్లీ/బెర్నే, అక్టోబర్ 7: స్విస్‌బ్యాంకు ఖాతాల వివరాలు భారత్‌కు అందాయి. విదేశీ బ్యాంకులో కుదవబెట్టిన నల్లధనం వెనక్కితెప్పిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు చేరడం ద్వారా ప్రయత్నాలకు తొలి అడుగుగా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి పద్ధతి కింద ఖాతాల వివరాలు స్విస్ అందజేసింది.

10/07/2019 - 06:48

అమరావతి : దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌లకు అదనంగా హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు.

Pages